తమన్నా తగిలినా.. నా పెళ్ళవ్వలేదు!!

Update: 2017-04-18 11:59 GMT
ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే మాట ఒకటే.. బాహుబలి 2 ఎలా ఉండబోతుంది అని. అంతలా ఇది ప్రతీ ఒక్కరిని ప్రభావితం చేసింది. ఐదు ఏళ్ళు గా ఈ సినిమా కోసం పని చేసిన వారు అందరు తమ పర్సనల్ విషయాలు పక్కన పెట్టి సినిమాను పూర్తీ చేసారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన పెళ్లిని కూడా పోస్ట్ పోన్ చేసాడు. పోనివ్ మనోడు అలా చెప్పకపోయినా కూడా.. పెళ్ళి మాత్రం చేసుకోలేదు. ఇక ప్రతినాయకుడు రానా దగ్గుబాటి కూడా సీనియర్ అయిపోతున్నాడు కాని పెళ్లి చేసుకోలేదు. అలాగే అనుష్కకు వరుడుని వెతుకుతున్నారేమో తెలియదు. తమన్నాకి ఇంకా చాలా వయస్సుందిలే.

ఇదే విషయాన్ని ప్రభాస్ ను అడిగితే.. ఒక పాయింట్ చెప్పాడు. ''ఇంకో రెండు ఏళ్ళు ఉంటె పెళ్లి వయసు కూడా దాటిపోతుంది'' అంటూ ముందు రానా జోకేశాడు. అక్కడే ఉన్న ప్రభాస్ కొంచెం  చిలిపిగా చెప్పుతూ ''తమన్నా  తో చేసిన హీరోలందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయ్ కాని.. మరి నాకు ఎప్పుడు అవుతుందో చూడాలి'' అంటూ నవ్వించేశాడు. ముఖ్యంగా చరణ్‌ కు ఇంకా ఇతర తమిళ హీరోలకు తమన్నాతో చేశాక పెళ్ళయ్యిందంటూ సెలవిచ్చాడు. ''నాతో రెండు సినిమాలు చేసింది తమన్నా. అయినాసరే ఇంకా నా పెళ్లి సెట్టవ్వట్లేదు ఏంటో మరి'' అంటూ కామెంట్ చేశాడు బాహుబలి. సర్లేండి.. తమన్నాతో చేసినా రామ్ పెళ్ళయ్యిందా.. సో తమన్నా సెంటిమెంట్ తూచ్ అంతే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News