జక్కన్నని కలిస్తే ప్రభాస్ మారిపోతాడట

Update: 2017-04-10 07:31 GMT
బాహుబలి2 మూవీతో మరో 18 రోజుల్లో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాలుగున్నరేళ్లు సుదీర్ఘ సమయాన్ని బాహుబలి కోసం వెచ్చించి తన కమిట్మెంట్ ఎలా ఉంటుందో చూపించిన యంగ్ రెబల్ స్టార్.. అందుకు తగ్గ గుర్తింపునే అందుకుంటున్నాడు. ఇప్పుడు బాహుబలి లాంటి బడా ప్రాజెక్టుతో సుదీర్ఘ అనుబంధం చివరి దశకు వచ్చేసింది. బాహుబలి2 ప్రమోషన్స్ తో ఈ ప్రాజెక్టుతో రిలేషన్ ముగిసిపోనుంది.

బాహుబలి ది కంక్లూజన్ సంగతేమో కానీ.. ఈ సమయంలో చాలానే కంక్లూజన్స్ కు ప్రభాస్ సమాధానం చెప్పేస్తున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించి బోలెడన్ని ప్రశ్నలు తలెత్తున్నాయి. 'ఇదే ప్రశ్న అనుష్కను అడగండి. నేను చెప్పిన సమాధానమే కాపీ అండ్ పేస్ట్ లా ఉంటుంది' అంటూ నవ్వేస్తున్నాడు ప్రభాస్. అలాగని తన సమాధానం ఏంటో చెప్పకపోవడం ఆశ్చర్యకరం. రాజమౌళితో తను మొదటి  సినిమా చేస్తున్నా.. తను చాలా పెద్ద డైరెక్టర్ అని తెలుసన్న ప్రభాస్.. దర్శకధీరుడితో మాట్లాడుతుంటే మైమరిపోతుంటానని.. తను వేరే మనిషిలా మారిపోతుంటానని చెబుతున్నాడు.

'నేను రాజమౌళికి చాలా పెద్ ఫ్యాన్ ని. గత పదేళ్లుగా కలిసి పని చేస్తున్నాం. అలాంటి వ్యక్తితో జర్నీ చేయడం అద్భుతమైన విషయం' అన్న ప్రభాస్.. డైరెక్ట్ తమిళ్ చిత్రం చేయాలని ఉందని చెబుతున్నాడు. మణిరత్నం.. గౌతమ్ మీనన్ లకు తాను అభిమానని చెప్పిన బాహుబలి.. వారితో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News