ప్ర‌భాస్ 'ప్రాజెక్ట్ K' ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

Update: 2021-12-10 09:31 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిపోయాడు. త‌న నుంచి ఏ అప్ డేట్ వ‌చ్చినా ద‌క్షిణాది ఫిల్మ్ ఇండ‌స్ట్రీల‌తో పాటు ఉత్త‌రాది వారు కూడా అటెన్ష‌న్ గా చూస్తున్నారు. ఈ ద‌ఫా ప్ర‌భాస్ ఏం చేయ‌బోతున్నారు?.. ఎలాంటి ప్రాజెక్ట్‌తో రాబోతున్నార‌న్న‌ర‌ని యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

ప్ర‌భాస్ కూడా త‌న క్రేజ్ కి త‌గ్గ ప్రాజెక్ట్ లనే ఫైన‌ల్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం `రాధే శ్యామ్‌`ని సంక్రాంతికి బ‌రిలోకి దించేస్తున్న ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రాల‌ని కూడా వ‌న్ బై వ‌న్ పూర్తి చేసే ప‌నిలో బిజీగా మారిపోయారు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న చిత్రాల్లో వ‌న్ ఆఫ్ ది క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ `ప్రాజెక్ట్ K`. `మ‌హాన‌టి` ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న‌ ఈ పాన్ వ‌ర‌ల్డ్ మూవీలో ప్ర‌భాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకోన్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ని మేక‌ర్స్ ప్రారంభించారు. దీప‌కా ప‌దుకోన్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటోంది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బ‌య‌టికి వ‌చ్చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత భారీ స్థాయిలో వేసిన సెట్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ శుక్ర‌వారం నుంచి ప్ర‌భాస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఆయ‌న‌పై ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని ద‌ర్శ‌కుడు చిత్రీక‌రిస్తున్న‌ట్టుగా తెలిసింది. ఇవి సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్ర‌భాస్ బల్క్ డేట్స్ ని ఇచ్చేసిన విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి సీనియ‌ర్ ద‌ర్శ‌కులు సింగీతం శ్రీ‌నివాస‌రావు క్రియేటివ్ హెడ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


Tags:    

Similar News