రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియాలో `పాజెక్ట్ - కె` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొద్ది భాగం షూట్ కూడా పూర్తయింది. భారీ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మలుస్తున్నారు. ఆనంద్ మహీంద్రా టెక్నాలజీ వినియోగించడం..విదేశీ సాంకేతిక నిపుణులు పనిచేయడం..అద్భుతమైన సెట్స్...ఇలా ప్రతీది ప్రాజెక్ట్ -కె పై అంచనాలు అంతకంతకు పెంచేస్తున్నాయి.
డార్లింగ్ పాన్ ఇండియా ఇమేజ్ నేపథ్యం సహా బ్యాక్ టూ బ్యాక్ `సలార్` లాంటి మరో యాక్షన్ ఎంటర్ టైనర్ సైతం సెట్స్ లో ఉండటంతో? ప్రాజెక్ట్ -కెపై బజ్ మరింత పెరిగిపోతుంది. దీంతో పాటు మరో సినిమా సెట్స్లో ఉన్నా? అంచనాలు దీనిపైనే. `బాహుబలి`..`ఆర్ ఆర్ఆర్` చిత్రాల్ని మించి ఉంటుందనే ఒకటే మీడియా ప్రచారం. వందల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఓ గ్లోబల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇంటా బయటా ప్రచారం ఠారెత్తిపోతుంది.
ఇంత జరుగుతున్నా? సినిమా నేపథ్యం ఏంటి? ఎలా ఉండబోతుంది? అన్న దానిపై ఇంత వరకూ ఎలాంటి లీక్ రాలేదు. కేవలం సినిమాకి సంబంధించి హైప్ తప్ప! కథలో దమ్ము ఎలా ఉండబోతుంది? అన్నది ఎక్కడా హైలైట్ కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రాజెక్ట్ -కె కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇదొక టైమ్ ట్రావేల్ నేపథ్యంతో కూడిన స్టోరీ అని సమాచారం.
ఓ సోషియా ఫాంటసీ కథని తీసుకుని అందుకు అనుగుణంగా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారుట. అందులోనే ఈ టైమ్ ట్రావెల్ కథని ఆసక్తికరంగా మలుస్తున్నట్లు సమాచారం. అవతార్ తరహాలో నేపథ్యం పూర్తిగా ఓ కొత్త తరహాలో చూపించబోతున్నారుట. సినిమా కోసం నిర్మిస్తున్న ప్రతీ సెట్ ఎంతో అద్భుతంగా ఉందని సమాచారం. ఆ సెట్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అందులో నిర్వహించే షూట్ కోసం అంతకు మించి ఖర్చు చేస్తున్నారుట. రోజు వందలాది మంది నిర్మాణంలో భాగమవుతున్నట్లు సమాచారం.