​సాహో కథపై కొత్త ఊహాగానాలు

Update: 2017-08-09 07:47 GMT

తెలుగు స్టార్ హీరో ప్రభాస్ సినిమా సాహో సినిమా ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. బాహుబలి సినిమా తరువాత ప్రారంబించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై దేశం మొత్తం ఆసక్తి చూపిస్తుంది. వాళ్ళ ఆశక్తికి తగట్టగానే ఆ సినిమా హీరోయిన్లు పైన రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి. సినిమా టీజర్ కూడా విడుదలై అందరిని ఆకట్టుకొంది. అయితే ఈ సినిమా కథ ఏమై ఉంటుంది అని అందరి ఆలోచనకు ఇప్పుడు ఒక కొత్త ఆధారం దొరికింది. రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతున్న షూటింగ్ విశేషాలు ప్రకారం ఈ కథ పునర్జన్మ పైన కానీ టైమ్ ట్రావెల్ పైకానీ అయి ఉండవచ్చు అని చెబుతున్నారు.

సాహో సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో బ్రిటిష్ జాతీయ జెండా ఒకటి నిటారుగా ఎగురుతూ కొన్ని వందల గుర్రాలు మధ్య కొన్ని యుద్ద సన్నివేశాలు చిత్రీకరణ చేస్తునట్లు తెలుస్తుంది. అంతే కాకుండా పోలో ఆట పై కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అక్కడ వాళ్ళ వేషాదారణ, నిర్మించిన సెట్ చూస్తుంటే ఇండియా ఇండిపెండెన్స్ ముందు కథ ఏదో ఉంది అని అనిపిస్తుందిట. అయితే ఈ రకం సెట్ అనేది సాహో సినిమాలో ఎందుకు ఉందో ఇంకా పూర్తి వివరాలు తెలియవలిసి ఉంది.

ఇప్పుడు అందరి ఆలోచన ఏంటిoటే షూటింగ్ ఏమో ఎప్పుడో మన దేశ గత చరిత్రకు సంబంధించి ఉంటే సాహో టీజర్ లో  మాత్రం స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా పునర్జన్మ పై ఏమైనా తీయబోతున్నారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. మరి కొంతమంది అయితే ఈ  టైమ్ ట్రావెల్ కథలో ప్రభాస్ ద్విపాత్రా అభినయం చేయవచ్చు అని చెబుతున్నారు. అయితే ఏది ఎంతవరకు వాస్తవం అనేది త్వరలో ఒక అధికార ప్రకటన ద్వారా తెలుస్తుంది లెండి. మన దేశం లో టైమ్ ట్రావెల్ సినిమాలు బహు తక్కువ అనే చెప్పాలి. ఏదైనా సాహో సినిమా వచ్చే ఏడాదిలో ఒక సంచలనం చేయడానికి సిద్దం అవుతుంది అని మాత్రం చెప్పవచ్చు.​


Tags:    

Similar News