బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ లెవెల్ లో మార్కెట్ ను సంపాదించుకున్న యాక్టర్ ప్రభాస్ ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిని అందుకునేలా సాహో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత చిత్రం బాహుబలిని రాజమౌళి తెరకెక్కించడం వల్ల ఆ స్థాయికి చేరుకోగలిగింది అనే చెప్పాలి. అదే విధంగా ప్రభాస్ లుక్ మరియు బాహుబలి కాన్సెప్ట్ కూడా అందుకు ఉపయోగపడింది.
అయితే ఆ సినిమాలో మొత్తం సౌత్ కి చెందిన నటీనటులే ఉన్నారు. దర్శకుడు రాజమౌళి కూడా ఎక్కువగా ఏ బాలీవుడ్ తారలను అందులో నటించమని కోరలేదు. కానీ సాహో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు సుజీత్ మాత్రం మొత్తం బాలీవుడ్ స్టార్స్ ని దింపుతున్నాడు. పైగా వారికీ డేట్స్ అడ్జస్ట్ కాకపోయినా రిక్వెస్ట్ చేసి మరి రప్పించుకుంటున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ శ్రద్ధ కపూర్ స్టోరీ చెప్పగానే డేట్స్ కుదిరితే చేస్తా అని చెప్పి కొన్ని రోజులు సస్పెన్స్ లో పెట్టి చివరకి ఒప్పుకుంది. అదే విధంగా నెయిల్ నితీన్ ముకేశ్ - అరుణ్ విజయ వంటి నటులను ఎంపిక చేసుకున్న దర్శకుడు ఆ తర్వాత మరి కొన్ని పాత్రలకు జాకీ శ్రోఫ్ - చుంకి పండే మరియు తీను ఆనంద్ -మందిరా బేడి వారిని కూడా తీసుకొని పూర్తిగా బాలీవుడ్ నటీనటులతో నింపేశాడు. దీంతో ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న సాహో.. ఒక బాలీవుడ్ సినిమా అనేట్టుగా ఉందనే కామెంట్స్ వినబడుతున్నాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి అక్కడి తారలను ఎంచుకున్నారా? లేక అంత భారీ బడ్జెట్ సినిమాలో తెలుగు నటులు సరిపోరు అనుకున్నారా అని సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అలా చూసుకుంటే రాజమౌళి బాహుబలి కథలో ఎక్కువగా తెలుగు నటీనటులకు ప్రాముఖ్యతను ఇచ్చాడు. మరి అంతగా తెలుగు ప్రేక్షకులకు తెలియని ఆ స్టార్స్ టాలీవుడ్ ని ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.