సాహో సైరా - చిక్కొచ్చి పడెరా

Update: 2018-11-19 04:21 GMT
గ్రాఫిక్స్ కీలక పాత్ర పోషించే సినిమాలతో అతి పెద్ద చిక్కు అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోవడం. అందులోనూ స్టార్స్ ఉంటె పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ గా రూపొందుతున్న చిరంజీవి సైరా ప్రభాస్ సాహోలకు ఇలాంటి చిక్కుముడే వచ్చింది. సైరా షూటింగ్ సజావుగానే సాగుతున్నప్పటికీ సిజె వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి ఎంత సమయం అవసరం అవుతుందో యూనిట్ ఖచ్చితమైన అవగాహనకు రాలేకపోతోంది. సమ్మర్ ని టార్గెట్ చేసుకుని మే 9 విడుదల చేయాలని ముందు అనుకున్న ప్లాన్. జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజైన డేట్ కాబట్టి సెంటిమెంట్ గా కూడా కలిసి వస్తుందని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.

కాని జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఆ తేదికి రావడం అనుమానమే అని ఇన్ సైడ్ టాక్. సిజె వర్క్ కోసమే ఐదారు నెలలు కేటాయించాల్సి వచ్చేలా ఉందని షూటింగ్ ఫిబ్రవరిలో అయిపోయినా ఆ తర్వాత సమయం చాలదని అంటున్నారు. సో మే మిస్ అయితే జూన్ లేదా ఆపై ఆగష్టు లో రావాల్సి ఉంది. మధ్యలో జూలైని సాధారణంగా విడుదలకు అనుకూలంగా పరిగణించరు.  

ఇక ప్రభాస్ సాహో కూడా ఇదే సమస్యతో సతమతమవుతోంది. ఆగస్ట్ 15 విడుదల ఖాయమంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే హంగామా మొదలు పెట్టేసారు. అనధికార వార్తలు ఈ డేట్ నే ధృవీకరిస్తున్నాయి. ఒకవేళ ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటే సైరా దీని దగ్గరలో వచ్చే ప్లానింగ్ చేయరు. కారణం సైరా నిర్మాత చరణ్ కు సాహో నిర్మాతతో ఉన్న ఫ్రెండ్ షిప్. సో సాహో సైరా లలో ఏది ముందు రావొచ్చు అనే ఊహాగానాలకు ఇప్పట్లో తెరపడే అవకాశం లేదు. సాహోలో భారీ గ్రాఫిక్స్ వర్క్ ఉన్న నేపధ్యంలో  ఆలస్యం అయినా రాజీ పడకుండా నెవెర్ బిఫోర్ క్వాలిటీ ఇవ్వాలనేదే యువి టార్గెట్.

మరోవైపు చరణ్ సైతం సైరా నాన్న జీవితంలో మైల్ స్టోన్ కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని వదలదలుచుకోలేదు. సో వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో మాత్రమే సైరా సాహోలు వచ్చే ఛాన్స్ ఉందని అనిపిస్తోంది. రామ్ చరణ్ నిర్మాతగా నటుడిగా రెండు పడవల ప్రయాణం చేయడం కొంత సైరా మీద ప్రభావం చూపిస్తోందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అదేమి లేదని చరణ్ ఎవరి బాద్యతలు వారికి పక్కాగా అప్పగించి మరీ తన సినిమాల షూటింగ్స్ లో ఉన్నాడని సైరా పోస్ట్ ప్రొడక్షన్ మీద విడుదల తేది ఆధారపడి ఉంటుందని స్పష్టత ఇస్తున్నారు యూనిట్ సభ్యులు. చూద్దాం కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో
Tags:    

Similar News