ఒకోసారి సినిమా హీరోలంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అనిపిస్తుంది. ముక్కు మొహం తెలియని మన కోసం పడిచచ్చిపోయే అభిమానం సొంతం చేసుకోవడం అంటే వీళ్లకు మాత్రమే సాధ్యం. అందులోనూ వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు మొదలుకుని పెద్దల వరకు అందరూ ఫ్యాన్స్ గా ఉంటారు. అందుకే హీరోలు కూడా తమవంతు సామాజిక బాధ్యతగా అభిమానులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను పరామర్శించి కళ్ళలో వెలుగు తెప్పించే ప్రయత్నం చేస్తారు. గతంలో మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇలా చేయటం చూసాం. ఇప్పుడు సాహో ప్రభాస్ ఈ బాధ్యతను తీసుకున్నాడు. పైన చూస్తున్న మదన్ అనే చిన్నపిల్లాడు ఓ అంతుచిక్కని వ్యాధితో బాధ పడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ బుడ్డోడు ప్రభాస్ కు వీరాభిమాని. ఎలాగైనా ఒక్కసారి కలుసుకోవాలని ఇంట్లోవాళ్లను అడుగుతూ ఉండేవాడు.
అది నేరుగా తీర్చుకునే అవకాశం లేకపోవడంతో తల్లితండ్రులు సైతం నిస్సహాయంగా ఎదురు చూస్తూ ఉండేవారు. ఒకవైపు తన అనారోగ్యంతో పోరాడుతూ మరోవైపు తన అభిమాన హీరోను చూడాలన్న తాపత్రయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రభాస్ టీమ్ ఎట్టకేలకు విషయాన్ని హీరోకు చేరవేశారు. అంతే ప్రభాస్ వెంటనే మదన్ ని పిలిపించుకుని అతనితో కాసేపు ముచ్చటించి ఫోటోలు కూడా తీసుకుని సంతోషంతో ఇంటికి పంపించాడు. ఇప్పుడు ఇవే ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి. తమ హీరో తెరమీదే కాక నిజ జీవితంలో కూడా ఎంత ఆదర్శంగా ఉంటాడో చెబుతూ ఫాన్స్ ఈ పిక్స్ ని తెగ షేర్ చేసుకుంటున్నారు. నిజంగా ఇది అభినందించదగ్గ ప్రయత్నం. మన తెలుగు హీరోలు ఇలాంటి అభిమానుల గురించి ఎప్పుడు తెలుసుకున్నా వెంటనే వాళ్లకు కాస్త ఉపశమనం కలిగించే చొరవ తీసుకుంటున్నారు. వ్యాధి పీడితుల కళ్ళలో ఆనందం వాళ్ళకు కొంత అదనపు ఊపిరి ఇచ్చినా చాలు అంతకంటే కావాల్సింది ఏముంటుంది.