ఐదేళ్లపాటు పడిన కష్టానికి బాహుబలి రూపంలో ప్రభాస్ కు మంచి ప్రతిఫలమే దక్కింది. తెలుగు నేలపైనే కాదు.. మొత్తం దేశంలోనే ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. బాహుబలి కోసం ప్రభాస్ పడిన కష్టం అంతా ఇంతా కాదని స్వయంగా రాజమౌళియే పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు. బాహుబలి పూర్తయిన వెంటనే తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో ‘సాహో’ షూటింగ్ మొదలెట్టేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కాస్త వాయిదా వేసి జులై నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
బాహుబలి-2 సినిమా ప్రభాస్ చాలాకాలం పాటు గడ్డంతోనే కనిపించాడు. అమరేంద్ర బాహుబలిగా ధీరోదాత్తమైన లుక్ లో కనిపించేందుకు అదే గెటప్ మెయిన్ టెయిన్ చేశాడు. సాహో సినిమా మొత్తం ప్రభాస్ మోడ్రన్, యంగ్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ కొత్త లుక్ కోసమే యాభై రోజుల పాటు షూిటింగ్ లకు విరామం ప్రకటించి యూఎస్ వెళ్లాడు. అక్కడి బ్యూటీ సెలూన్స్ల్ లో లేటెస్ట్ అండ్ అల్ట్రా మోడరన్ ఫేషియల్స్ చేయించుకుని మరింత హ్యాండ్ సమ్ గా కనిపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ః
సాహో షూటింగ్ జులైలో ప్రారంభించి కొంత పార్ట్ హైదరాబాద్ లో పూర్తి చేశాక యూనిట్ దుబాయ్ బయలుదేరి వెళ్లనుంది. అక్కడ 45 రోజుల పాటు షూటింగ్ జరగనుంది సినిమాలో మేజర్ పార్ట్ ఇక్కడే చిత్రీకరిస్తారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ ఈ చిత్రం కోసం మార్చిలోనేే డేట్స్ ఇచ్చినా వాటిని వాయిదా వేసి జులై, ఆగస్టులో పని చేసేందుకు అంగీకారం తెలిపారని చిత్ర వర్గాల సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తుండటం విశేషం. బాహుబలి సినిమాతో ప్రభాస్ కుే వచ్చిన క్రేజ్ దృష్ట్యా సాహో తెలుగు, తమిళం, హిందీ భాషలో ఒకేసారి నిర్మిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/