బాహుబలి మూవీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోయినా.. ప్రభాస్ మాత్రం ఇప్పటికీ సహజ పద్ధతిలో సో సింపుల్ గానే ఉంటున్నాడు. అయితే.. ఇప్పుడు ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బ్యాంకాక్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీని గురించి ప్రభాస్ ఎంత సింపుల్ గా రియాక్ట్ అయ్యాడో తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు.
'మెడామ్ టుస్సాడ్స్ వాళ్లు నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ అద్భుతమైన ప్రాజెక్టులో నన్ను భాగం చేసుకున్నందుకు.. నా గురువు ఎస్ ఎస్ రాజమౌళికి ఎన్నెన్నో కృతజ్ఞతలు' అంటూ క్రెడిట్ అంతా జక్కన్నకి ఇచ్చేశాడు ప్రభాస్. 'ఈ లుక్ ని కొన్ని వారాల క్రితమే ఫినిష్ చేశారు. నిజానికి నేను హాంకాంగ్ లోని టుస్సాడ్స్ కి 2013లో తొలిసారి వెళ్లాను. కానీ అక్కడ నా మైనపు శిల్పం ఏర్పాటవుతుందని ఎప్పుడూ ఊహించలేదు' అని చెప్పాడు ప్రభాస్.
బ్యాంకాక్ మ్యూజియంలోని మూవీ రూంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. జేమ్స్ బాండ్.. స్పైడర్ మ్యాన్.. వోల్వరిన్.. కెప్టెన్ అమెరికాల సరసన ప్రభాస్ విగ్రహం కూడా ఏర్పాటు కానుంది. మార్చిలో దీని ఆవిష్కరణ జరగనుండగా.. అంతకు ముందు ప్రపంచమంతా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని పర్యటనకు తిప్పనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/