* బాహుబలి తరువాత మీలో మీరు కనిపెట్టిన మార్పలు ఏంటి?
నాకు ఐతే ఎలాంటి మార్పులు కనిపించలేదు - ఐతే ఇండియా మొత్తం ఇప్పుడు నాకు కొద్దిగా ఐడెంటిటీ వచ్చిందని మాత్రం అనిపిస్తుంది.
* కొద్దిగా కాదులెండి చాలా వచ్చింది - అందుకే గా బాహుబలి తరువాత వస్తున్న మీ సాహో కి కూడా ఇంత క్రేజ్ వచ్చింది?
బాహుబలి వేరు సాహో వేరు అసలు యే మాత్రం సంబంధం లేని సినిమాలు - ఐతే మీరు అన్నట్లుగా బాహుబలి వల్లే సాహో కి ఇంత క్రేజ్ వచ్చింది అనడం లో ఎలాంటి డౌట్ లేదు కానీ బాహుబలి తో సాహో ని కంపేర్ చేయలేము.
* సాహో కోసం కూడా ఇంత టైం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?
ఇంటర్నేషనల్ రేంజ్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేసాము - సాహో లో దాదాపు అన్ని సీన్స్ కి హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేశారు - భారీ బడ్జెట్ ప్రతి సన్నివేశానికి రిహార్సల్స్ అని - సెట్స్ అని అనుకున్న దాని కంటే ఎక్కువ టైం పట్టేసింది - మరో వైపున గ్రాఫిక్స్ అంటూ దానికికొంత టైం - నిజానికి ఇందులో నా పార్ట్ షూట్ అవ్వగానే నేను నా నెక్స్ట్ మూవీ జాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యాను - సాహో అయ్యాక వచ్చే జాన్ విషయం లో మాత్రం ఫాన్స్ ని ఇంతలా వెయిట్ చేయించను.
* ఇప్పుడు ప్రభాస్ తో మూవీ తీయాలంటే 100కోట్ల బడ్జెట్ మినిమం అయిపోయింది - మరి జాన్ కూడా భారీగానే ఉండబోతుందా?
కథ ని బట్టి బడ్జెట్ ని ఫిక్స్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ని నేను చాలా నమ్ముతాను - నా మార్కెట్ ఎక్కువ ఉంది కదా అని అక్కర్లేకుండా బడ్జెట్ పెట్టడం వేస్ట్. సాహో లో కూడా మేము ఆడియన్స్ కి ఒక ఇంటర్నేషనల్ తెలుగు మూవీ అందిద్దాం అని ఇంత భారీ గా ఖర్చు చేసాము. ఇక మీరు అడిగినట్లుగా జాన్ కి కూడా భారీ గానే ఖర్చు చేస్తున్నాం ఐతే సాహో అంత కాదులేండి.
* ఒక యంగ్ డైరెక్టర్ ని నమ్మి మీరు ఇన్నాళ్లు డేట్స్ ఇచ్చారు - అదే డైరెక్టర్ ని నమ్మి మీ వాళ్ళతో ఇంత డబ్బు పెట్టించారు - మరి రిజల్ట్ విషయం లో టెన్షన్ లేదా?
సొంత సినిమా అవ్వడం వల్ల చాలా టెన్షన్ గా ఉంది - నా ఫ్యామిలీ మెంబెర్స్ ఇందులో డబ్బులు పెట్టారు, నిజానికి నాకంటే ఈ సినిమా సక్సెస్ పై వాళ్లే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు - ఇక నేను సుజీత్ కంటే మనోడు చెప్పిన కథ ను నమ్మాను - ఐతే షూట్ కి వచ్చాక సుజీత్ వర్కింగ్ మోడ్ తో మా అందరికి ఫుల్ కాంఫిడెన్స్ వచ్చేసింది - చాలా విషయాలూ సుజీత్ చాలా కూల్ గా డీల్ చేసాడు - శ్రద్ధ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవడం దగ్గర నుంచి ఈ సినిమా లో కీలక డెసిషన్స్ అన్ని సుజీత్ చాలా నీట్ గా హాండిల్ చేసాడు.
* సాహో తో మీరు మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని మీ ఖాతా లో వేసుకోవాలని మా తుపాకీ డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది - అల్ ది బెస్ట్..
థాంక్ యూ - డార్లింగ్స్ అంత దయచేసి సాహో ని థియేటర్స్ లో మాత్రమే చూడండి