దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత చిత్రం బాహుబలి. తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచదేశాలకు పరిచయం చేసి, బాక్సాఫీస్ వద్ద భారీ కనక వర్షం కురిపించింది ఈ సినిమా. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, పవర్‌ఫుల్ విలన్‌గా రానా నటించారు. అవంతిక, దేవసేనలుగా తమన్నా, అనుష్క నటించారు. ప్రముఖ పాత్రలలో రమ్యకృష్ణ, నాజర్ మెప్పించారు. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బాహుబలి-2 ది కన్‌క్లూజన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో సరిగ్గా మూడేళ్లు పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్ర బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో అతిపెద్ద సినిమా అని, ఎప్పటికీ గుర్తిండేపోయే గొప్ప జ్ఞాపకం అంటూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రభాస్.
ప్రభాస్ మాట్లాడుతూ.. ‘బాహుబలి-2 కేవలం సినిమా జాతీయ స్థాయిలో మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందింది. నా జీవితంలో అతిపెద్ద సినిమా. నా అభిమానులకు బాహుబలి సినీ బృందానికి, అద్భుత చిత్రంగా తీర్చిదిద్దిన రాజమౌళికి ఎప్పటికి రుణపడి ఉంటాను. బాహుబలి-2 పూర్తి అయి మూడు సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఇంతటి గొప్ప చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా.. మీ అందరి ప్రేమకు కృతజ్ఞుడిని’. అంటూ షూటింగ్ సమయంలో రానా, రాజమౌళితో కలిసి ఉన్న ఓ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
అయితే బాహుబలి మొదటి భాగం 2015లో విడుదలవ్వగా.. రెండో భాగం 2017 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు సృష్టించాయి. ‘బాహుబలి 2’ సినిమా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 2 వేల కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రూ. 1200 కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషం. మన దేశంలో హిందీ వెర్షన్‌లో రూ. 800 కోట్ల వరకు కలెక్ట్ చేయడం మరో విశేషం. ‘బాహుబలి 2’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 200 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇటు ఓవర్సీస్‌లో కూడా తెలుగు వెర్షన్ దాదాపు రూ. 100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తెలుగు సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ఆ తర్వాత ఇండియన్ సినిమాగా మారింది. ఈ చిత్రం తెలుగులోనే కాదు.. ఇప్పటి వరకు మన దేశంలోనే ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్లు వసూళు చేసిన చిత్రంగా రికార్డులను తిరగరాసింది. డిజిటల్ యుగంలో మన దేశంలోనే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన చిత్రంగా బాహుబలి2 నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.