బ్యాంకాక్ ఏంది? ప‌్రభాస్ ఏంది? అక్కడికి వెళ్లినోళ్లు ఆయన్ను చూసేందుకు ఎగబడటం ఏంది? లాంటి సందేహాలు వస్తున్నాయా? మీ క్వశ్చన్లను వరుసగా తీర్చస్తాం. ఒక్క సినిమా కోసం (సాంకేతికంగా చూసినప్పుడు రెండు సినిమాలు అనుకోండి) ఐదేళ్ల కెరీర్ ను పణంగా పెట్టటం ఒక టాప్ హీరో అస్సలు చేయడు. కానీ.. అలాంటి రిస్క్ చేసిన డార్లింగ్ ప్రభాస్ కు దక్కాల్సిన పేరు.. ప్రతిష్ఠలు దక్కాయనే చెప్పాలి. బాహుబలితో తిరుగులేని స్టార్ డమ్ ను చేజిక్కించుకోవటమే కాదు.. జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్‌కు ఓ కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చింది.
బాహుబలి పేరుప్రఖ్యాతులు ఎంతన్న విషయాన్ని చూస్తే.. ప్రపంచంలో అత్యంత ప్రముఖుల మైనపు విగ్రహాల్ని తయారు చేసే టుస్సాడ్స్ సైతం.. ప్రభాస్ విగ్రహాన్ని పెట్టేందుకు తనకు తానుగా ముందుకు వచ్చింది.
ప్రముఖుల మైనపు విగ్రహాల్ని తయారు చేసి లండన్.. బ్యాంకాక్.. హాంకాంగ్.. సింగపూర్ లలోని తమ మ్యూజియంలలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖుడి విగ్రహాన్ని టుస్సాడ్స్ లో ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి. ఆ గౌరవం ప్రభాస్‌కు దక్కింది. ఈ ఆఫర్ తన దగ్గరకు వచ్చిన వైనాన్ని ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
బాహుబలి 2 షూటింగ్ సమయంలో టుస్సాడ్స్ ప్రతినిధులు ప్రభాస్ సన్నిహితుల వద్దకు తమ ఆలోచనను పంచుకున్నారు. టుస్సాడ్స్ వారు.. నీ మైనపు విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారన్న మాట విన్న వెంటనే.. తాను ఆశ్చర్యపోయానని చెప్పారు ప్రభాస్. బాహుబలి వర్క్ వుట్ అయితే అద్భుతాలు జరుగుతాయని తాను అనుకున్నాను కానీ మరీ ఈ స్థాయిలో ఎంతమాత్రం అనుకోలేదని చెప్పారు.
బాహుబలి 2 షూటింగ్ సమయంలో వచ్చిన టుస్సాడ్స్ ప్రతినిధులు తన కొలతలు ఒక పూటంతా తీసుకున్నారని ప్రభాస్ చెప్పారు. ఒక్కో విగ్రహం కోసం మన రూపాయిల్లో దాదాపు కోటిన్నర వరకూ ఖర్చు అవుతుంటుందని చెబుతారు. పేరుకు మైనపు విగ్రహమే కానీ..నిజమైన మనిషే ఎదురుగా నిలుచున్నట్లుగా ఉండేలా ఫీల్ కల్పించటం టుస్సాడ్స్ ప్రత్యేకత.
తాజాగా బ్యాంకాక్ లోని తమ మ్యూజియంలో ప్రభాస్ విగ్రహాన్ని పెట్టిన తర్వాత నుంచి.. దీన్ని చూసేందుకు ఎగబడుతున్నారట. బ్యాంకాక్ కు వెళ్లిన వారంతా ప్రభాస్ విగ్రహాన్ని అస్సలు మిస్ కావటం లేదట. కొంతమందికి మాత్రమే లభించే అవకాశం తనకు దక్కటాన్ని తాను అస్సలు ఊహించలేదని చెప్పే ప్రభాస్.. విగ్రహం విషయం మీద ఫుల్ హ్యాపీగా ఉన్నారట. రాజమౌళి సైతం ఈ విషయం తెలిసిన వెంటనే చాలా సంతోషపడినట్లుగా ప్రభాస్ పేర్కొన్నారు. తాను తీర్చిదిద్దిన పాత్రకు అంతర్జాతీయ స్థాయిలో ఊహించని గుర్తింపు లభిస్తే.. ఏ దర్శకుడికి మాత్రం సంతోషం ఉండదు చెప్పండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/