`మహానటి` లాంటి బంపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించాక దర్శకుడు నాగ్ అశ్విన్ రెండేళ్ల పాటు వేచి చూసాడంటే సన్నివేశం అర్థం చేసుకోవచ్చు. మామ ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ అధినేత అయినా కానీ వెంటనే ప్రాజెక్టును లాంచ్ చేయలేకపోయారు. అయితే లాంగ్ టైమ్ వెయిట్ చేసినందుకు ఎట్టకేలకు మామా అల్లుళ్లు అదిరిపోయే జాక్ పాట్ పట్టేశారు. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాని ప్రకటించి ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చారు.
అందుకేనేమో ఈ నవ్వులు.. చిరు నవ్వులు! ఆ మొహాలు ట్యూబ్ లైట్ కాంతితో వెలిగిపోతున్నాయి. మొత్తానికి ఎంతో వేచి చూశాక ఇలాంటి గ్రాండ్ ఆఫర్ దొరికేసింది అంటే ఆ నవ్వుల్లో వెలుగులు అంతే ఇదిగా ఉంటాయి మరి. ఇంతకీ ప్రభాస్ తో ఏ రేంజు సినిమా తీస్తారో!! అంటే... పాన్ ఇండియా రేంజులో రిలీజయ్యే బహుభాషా చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ తమ తదుపరి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన చేయడానికి ముందే దర్శకుడు- నిర్మాత ఈ రోజు ప్రభాస్‌ను కలిశారు. నాగ్ అశ్విన్- అశ్విని దత్ - ప్రభాస్ ఎంతో ఇదిగా నవ్వులు చిందిస్తూ ఉన్న ఫోటో తాజాగా సోషల్ మీడియాలోకి రిలీజైంది. ఆ ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తాజా క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో ప్రభాస్ అభిమానులు గర్విస్తారని చిత్రబృందం హామీ ఇచ్చింది. జాన్ (ప్రభాస్ 20) తర్వాత సెట్స్ కి వెళ్లబోయేది ఈ సినిమాయేనా కాదా? అన్నది తెలియాల్సి ఉందింకా.