బాహుబలిలో శివుడు పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటాడు? ఆరడుగల పైన ఎత్తు - కండలు తిరిగిన శరీరం - పూర్తి ఫిట్ నెస్ బాడీతో.. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కన్ను కుట్టే రేంజ్ కనిపిస్తాడు యంగ్ రెబల్ స్టార్. ఇందుకోసం బరువు పెరుగుతూనే బాడీ మెయింటెయిన్ చేసేలా బోలెడన్ని ఎక్సర్ సైజులు. ఆ పాత్ర కోసం ప్రభాస్ తన వెయిట్ ను 130 కిలోలకు పెంచుకున్నాడు.
ఇప్పుడు శివుడు పాత్రకు తండ్రి అయిన అమరేంద్ర బాహుబలి రోల్ కోసం మరింతగా బరువు పెరిగాడు. ఈసారి మరో 17కిలోల వెయిట్ పెరిగాడని తెలుస్తోంది. అంటే దాదాపు 150 కిలోల బరువు అన్నమాట. ఇంత వెయిట్ పెరుగుతూ, అంత స్టిఫ్ గా బాడీ ఎలా మెయింటెయిన్ చేస్తున్నాడు.. ఇంతకీ ప్రభాస్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటి.. డైట్ ఏం తీస్కున్నాడో లాంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అలాంటివారి కోసమే ఈ డీటైల్స్.
రోజు ఉదయం - సాయంత్రం పాటు గంటన్నరపాటు ఎక్సర్ సైజులు చేస్తాడు. అమెరికా నుంచి తెప్పించుకున్న స్పెషల్ జిమ్ ఎక్విప్ మెంట్ తో ఈ తంతు సాగుతుంది. వామప్ తో పాటు.. యోగ - డంబుల్స్ - స్ట్రెచింగ్ - క్రాస్ ఫిట్స్ - ప్లయోమెట్రిక్స్.. ఇందులో భాగం.
ఇక ఫుడ్ విషయానికొస్తే హోమ్ ఫుడ్ మాత్రమే తీసుకోవడం అసలు సీక్రెట్. వెజ్ - నాజ్ వెజ్ బ్యాలెన్స్ గా తీసుకోవడం, ప్రొటీన్స్ కార్బొహైడ్రేట్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. 42 కోడిగుడ్డు తెల్ల సొనలు - పావుకిలో చికెన్ - తాజా పళ్లు.. ఇదీ ప్రభాస్ బ్రేక్ ఫాస్ట్. బ్రౌన్ రైస్ - ఓట్స్ - సలాడ్స్ - బ్రొకలి - పాస్టా.. ఇది లంచ్. వర్కవుట్స్ తర్వాత హాఫ్ స్కూప్ ప్రొటీన్ పౌడర్.. సూప్ తో గానీ, పాలతో గానీ తీసుకుంటాడట ప్రభాస్.