డ్యాన్స్ మాష్టర్ ప్రభుదేవా అంటే ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని ప్రసిద్ది. ఎంత పెద్ద జాక్సన్ అయినా కూడా.. వయస్సు 43 ఏళ్లు వచ్చేశాక బాడీలోని స్ర్ర్పింగులు కాస్త ఇబ్బందిపెట్టేస్తాయి. అందుకే మెరుపుతీగలా డ్యాన్సు వేయాలంటే ఇప్పుడు మన ప్రేమికుడుకి కూడా కష్టమవుతోందట. ఏకంగా సెట్ లో డాక్టర్లను పెట్టుకుని షూటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.
అభినేత్రి సినిమా హిందీ వర్షన్ 'టూటక్ టూటక్ టూటియా' కోసం సెక్సీ సైరన్ ఈషా గుప్తా అండ్ సోనూ సూద్ కాంబినేషన్లో ప్రభుదేవా ఒక పాటను చిత్రీకరించాడు. ఈ పాటలో సోనూతో చాలా కష్టమైన స్టెప్పులే వేయించాడులే. అయితే అవే కష్టమైన స్టెప్పులు వేయడం ప్రభుకు చాలా సులువు. కాని అలా చేస్తుండగా మనోడికి వెన్నునొప్పి వచ్చేసి.. కండరం పట్టేసిందట. ఆ దెబ్బతో ఇప్పుడు రోజూ ఏ షూటింగ్ చేసినా కూడా సెట్ లో ఖచ్చితంగా ఒక ఫిజియోతెరపిస్టును పెట్టే షూటింగ్ చేస్తున్నారట. అభినేత్రి షూటింగ్ లో అయితే డాక్టర్ అండ్ ఆంబులెన్స్ లేకుండా షూటింగే చేయలేదు అంటున్నాడు సోనూ.
మొత్తానికి హెల్త్ పరమైన సమస్యలు వస్తే ఇలాంటి మెరుపుతీగ వంటి డ్యాన్సర్లకు కాస్త కష్టమే. ఆ ఒక్క కారణంతో వీరు డ్యాన్సుకు చాలాకాలం దూరమవ్వాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తవహించవయ్యా ప్రభూ!!