అనుష్క లవ్వర్ తో డేట్ కోసం తపిస్తోంది

Update: 2016-05-11 08:19 GMT
రోజులు మారిపోయాయి. ఒకరికి సొంతమైన వారి మీద మనసు పడటం తప్పేం కాదన్నట్లుగా కనిపించేవారికి తగ్గట్లే ప్రముఖులు కూడా అలానే వ్యవహరించటం కాస్తంత చిత్రమే. తాజాగా ఇదే జాబితాలో చేరుతోంది బాలీవుడ్ భామ ప్రాచీ దేశాయ్. తన దూకుడు ఆటతో దేశంలోని కోట్లాది మంది అమ్మాయిల్ని మనసుల్ని దోచుకున్న విరాట్ కోహ్లీ అంటే పడి చస్తున్న బాలీవుడ్ భామల జాబితా రోజురోజుకి పెరుగుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మతో లవ్వాట.. అది కాస్తా బ్రేకప్ కావటం.. ఈ మధ్యనే కాస్తంత ప్యాచప్ అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నా.. కోహ్లీ మీద తమకున్న ప్రేమను బయటకు చెప్పేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీలు.

మొన్నటికి మొన్న సెక్స్ బాంబ్ రాఖీసావంత్ అయితే.. ఓపెన్ గానే కోహ్లీ అంటే తనకెంత ఇష్టమన్న విషయాన్ని చెప్పటేమ కాదు.. ఈ విషయంలో అనుష్క ఏమన్నా తాను పట్టించుకోనని చెప్పటం తెలిసిందే. తాజాగా ఇదే రీతిలో కోహ్లీ మీద మనసైందంటూ రాగాలు తీస్తోంది ప్రాచీ దేశాయ్. ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ జీవితకథ ఆధారంగా తీసిన అజహర్ చిత్రంలో నటించిన ప్రాచీ రీసెంట్ గా కోహ్లీ మీద తనకు మనసైందని చెప్పొకొచ్చింది. అతడితో డేటింగ్ కు వెళ్లాలని ఉందని మీడియాతోనే చెప్పేసిన ఆ అమ్మాయి తెంపరితనాన్ని చూసిన అనుష్క అభిమానులు ఉడికిపోతున్నారు.

ఓపక్క ప్యాచప్ పనిలో ఉన్న జంటను కలవాలని కోరుకోకుండా.. కోహ్లీ మీద మనసైందంటూ రాఖీ.. ప్రాచీ లాంటి వాళ్లు ఎలా మాట్లాడతారంటూ అనుష్క అభిమానుల ఆగ్రహం చూస్తే.. మరి.. కోహ్లీతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన అనుష్క పరిస్థితి ఇంకెలా ఉందో..?
Tags:    

Similar News