తెలుగులో అల్టిమేట్ మేల్ యాంకర్‌గా గుర్తింపు పొందిన ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న సినిమా.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన ప్రదీప్.. ఈ సినిమాతో హీరోగా ప్రమోషన్ కొట్టేశాడు. అయితే.. నిజానికి ఈ సినిమా మొదలైనపుడు జనాలకు పెద్దగా తెలియదు. కానీ.. ఈ చిత్రం నుంచి వచ్చిన 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా' పాటతో సీన్ మొత్తం మారిపోయింది.
సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటతో సినిమాకు క్రేజ్ వచ్చింది. అయితే.. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా.. గత ఏడాది మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా కుదర్లేదు. చివరకు పలు సినిమాలు ఓటీటీ బాట పట్టినా.. ఈ సినిమా మాత్రం అక్కడ రిలీజ్ కాలేదు.
తాను హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కావడంతో.. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ప్రదీప్ కోరుకున్నాడు. దర్శక నిర్మాతలు కూడా ఆయనకు సహకరించారు. అయితే.. ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించింది. థియేటర్లలో రిలీజ్ అవుతుండడం ఒకెత్తయితే.. సోలోగా థియేటర్ లోకి వస్తుండడం మరో ఎత్తు.
సంక్రాంతి సినిమాల్లో 'క్రాక్' మినహా మిగలినవన్నీ తేలిపోయాయి. 'క్రాక్' కూడా ఇక నెమ్మదిస్తోంది. గత వారం విడుదలైన 'బంగారు బుల్లోడు' డిస్కషన్ లోనే లేకుండా పోయింది. ఇలాంటి టైంలో.. ఏవో చిన్నా చితకా చిత్రాలు మినహా.. ప్రదీప్ చిత్రాఆనికి పోటీయే లేదు. దీంతో.. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదే 29న రావాలనుకున్న సుమంత్ సినిమా 'కపటదారి'ని వాయిదా వేసేయడం కూడా ప్రదీప్ కు కలిసొచ్చింది. ఇక, ప్రదీప్ సినిమాను గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లు రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ విధంగా.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాకు అన్నీ కలిసొస్తున్నాయి. మరి, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందనేదే కీలకం. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ప్రదీప్ కెరీర్ నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందనడంలో సందేహం లేదు.