బుల్లితెరపై యాంకర్ గా హవా నడిపిస్తున్న ప్రదీప్ మాచిరాజు.. ''30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'' మూవీతో హీరోగా పరిచయమయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు మున్నా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎస్ వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్.వీ బాబు నిర్మించాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని జనవరి 29న గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ వారు కలసి విడుదల చేశారు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా ప్రదీప్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఇప్పుడు నిర్మాతలందరూ ప్రదీప్ కోసం వెంట పడుతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి '30 రోజుల్లో..' సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన 'నీలి నీలి ఆకాశం' సాంగ్ వల్ల హిట్ అయిందనే కామెంట్స్ వచ్చాయి. కారణాలు ఏవైనా ప్రదీప్ సినిమా దాదాపు ఎనిమిదన్నర కోట్లు షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలేశాయి. ఓ డెబ్యూ హీరోకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం గొప్ప విషయమనే చెప్పుకోవాలి. అలానే ప్రదీప్ కూడా సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు ఈ స్టార్ యాంకర్ తో సినిమాలు చేయడానికి చాలామంది చోటా మోటా నిర్మాతలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇక ఫ్యాన్స్ అయితే 'టాలీవుడ్ ఆయుష్మాన్ ఖురానా' అంటూ ప్రదీప్ ని ముద్దుగా పిలవడం స్టార్ట్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రదీప్ త్వరలోనే నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.