బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అయిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఆరంభంలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా లోని నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. కాని ఆ అంచనాలను సినిమా అందుకోలేక పోయిందంటూ టాక్ వచ్చింది. థియేటర్ రిలీజ్ అయిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కు కరోనా ఆంక్షలతో పాటు టాక్ పరంగా నిరాశ పర్చడంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు.
సినిమా టాక్ ఎలా ఉన్నా ఒక్కసారి సినిమాను చూడాలని చాలా మంది ఆశ పడుతున్నారు. ఓటీటీ ద్వారా ఆ సినిమాను చూసేందుకు దాదాపు నాలుగు నెలలుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. బిజినెస్ విషయం కారణంగా ఈ సినిమా ఇంత లేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఎట్టకేలకు సినిమా బిజినెస్ సెట్ అవ్వడంతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రదీప్ క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రైమ్ భారీ మొత్తంనే చెల్లించిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రదీప్ ఈ సినిమాలో హీరోగా నటించగా ఆయనకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వైవా హర్ష కమెడియన్ గా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో సుభలేక సుధాకర్ కీలక పాత్రలో కనిపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు మున్న దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ మరియూ యూవీ క్రియేషన్స్ వారు పంపిణీ చేశారు.