పిక్ టాక్ : ఈ అందం మన మేకర్స్‌ కు కనిపించడం లేదా?

Update: 2021-07-14 11:30 GMT
కంచె సినిమాతో హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. ఈ అమ్మడు మొదటి సినిమా తోనే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. తెలుగులో ఈమెకు ఖచ్చితంగా స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు. కంచెలో పద్దతైన పాత్రలో హుందాగా కనిపించడంతో పాటు నటిగా ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్‌ ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది కాని అదృష్టి కలిసి రాకపోవడంతో విఫలం అయ్యింది.

తెలుగు లో ప్రగ్యా జైస్వాల్‌ ఆఫర్లు అంతంత మాత్రంగానే వస్తున్న నేపథ్యంలో ఇతర భాషల్లో కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా హాట్‌ ఫొటో షూట్‌ లు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. ఈమె ప్రతి ఫొటో షూట్‌ కూడా వైరల్‌ అవుతూనే ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న ఈమె ఎక్స్‌ పోజింగ్ చేస్తే అందంగా కనిపిస్తుంది కాని ఎబ్బెట్టుగా అస్సలు ఉండదు. ఆ విషయం నెటిజన్స్‌ అంతా ఒప్పుకుంటారు. కాని మన సినిమా మేకర్స్ మాత్రం ఈమె ను సోషల్‌ మీడియాలో ఫాలో అవ్వడం లేదా చూడటం లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ పొటోను షేర్‌ చేసిన ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి తన అందం రేంజ్‌ ను ప్రదర్శించింది. దాంతో ఆమె అభిమానులు ఇంత అందంగా ఉన్న ప్రగ్యా ను మన ఫిల్మ్‌ మేకర్స్‌ ఎందుకు చూడలేక పోతున్నారు. ఇంత అందంను వృదా చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మన ఫిల్మ్‌ మేకర్స్‌ ఈమె ఫొటోలను సరిగ్గా చూస్తే హీరోయిన్‌ గా వరుసగా ఆఫర్లు ఇస్తారు. కాని వారు చూడటం లేదేమో అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ పెడతున్నారు. ప్రస్తుతం ఈమె బాలయ్య కు జోడీగా అఖండ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలై సక్సెస్‌ అయితే ఖచ్చితంగా ఈమెకు టాలీవుడ్‌ లో మరిన్ని ఆఫర్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
Tags:    

Similar News