పొట్టినిక్క‌రులో చెల‌రేగిన `అఖండ` బ్యూటీ

Update: 2021-08-28 02:30 GMT
పూణే బ్యూటీ ప్ర‌గ్యా జైశ్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లు అవుతున్నా ఇక్క‌డ ఆశించినంత‌గా బిజీ న‌టిగా మార‌లేక‌పోయింది. కంచె త‌ర్వాత స‌రైన పెర్పామెన్స్ ఓరియేంటెడ్ రోల్ త‌న‌కు ద‌క్క‌లేదు. క‌మ‌ర్శియ‌ల్ పంథాలో సినిమాలు చేసినా అవేవీ త‌న‌కు స‌క్సెస్ ని కానీ గుర్తింపును కానీ తీసుకురాలేదు. అయినా అడ‌పాద‌డ‌పా ఏదో ఒక‌ సినిమాతో అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. బిజీ న‌టి కాక‌పోయినా ఏడాదికి ఒక సినిమా చొప్పున చేసుకుంటూ బండి లాగించేసింది.

అయితే ఇటీవ‌ల ప్ర‌గ్య రూట్ మార్చింది. సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ ఛాయిస్ గా నిలిచేలా త‌న‌ని తాను మలుచుకుంది. అలాగే సాటి నాయిక‌ల‌తో పోటీప‌డుతూ సోష‌ల్ మీడియాల్లోనూ గొప్ప‌గా పాపుల‌ర‌వుతోంది. వ‌య‌సు రీత్యా 30 దాటిన నేప‌థ్యంలో సీనియ‌ర్ స్టార్ల‌కు స‌రిజోడిగా ఈ అమ్మ‌డిని ఎంపిక చేసేందుకు ఇప్పుడు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆస‌క్తిగా ఉన్నారు. ప్ర‌స్తుతం న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `అఖండ‌`లో ప్ర‌గ్య క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

తెలుగులో న‌టిస్తోన్న ఏకైక‌ చిత్ర‌మిది. ఇక్క‌డ కెరీర్ ప‌రంగా ప్ర‌గ్య‌ ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.  `అఖండ` కెరీర్ ట‌ర్నింగ్ అవ‌కాశమ‌ని ప్ర‌గ్య భావిస్తోంద‌ట‌. బాల‌య్య అభిమానుల్లో సినిమాపై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. `సింహ‌`..`లెజెండ్` త‌ర్వాత బాల‌య్య -బోయ‌పాటి శ్రీను క‌లిసి చేస్తోన్న చిత్రం కావ‌డంతో అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. మ‌రి ఇందులో ప్ర‌గ్యా పాత్ర స్పాన్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి. ఇక బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న `ది ఫైన‌ల్ ట్రూత్` లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో న‌టించినా అక్క‌డా అమ్మ‌డినిక బిజీ హీరోయిన్ గా మార్చ‌లేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో రెండు బిగ్ చాన్సెస్ అనే చెప్పాలి.

ఇక సోష‌ల్ మీడియాలో ప్ర‌గ్యా ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. టెంప్టింగ్  ఫోటోల‌తో కాక‌లు రేప‌డం ఈ అమ్మ‌డి ప్ర‌త్యేక‌త. కొత్త ఫోటో షూట్ల‌తో హీటెక్కించ‌డం.. వాటిపై రివ్యూలు చేసుకోవ‌డం లో ప్ర‌గ్యా సీనియ‌ర్ అయిపోయింది.  తాజాగా ప్రగ్యా జైశ్వాల్ కొత్త ఫోటో ఒక‌టి వైర‌ల్ గా మారింది.  డెనిమ్ జీన్స్ షార్ట్ లో థై అందాల్ని ఎలివేట్ చేస్తూ... గ‌ళ్ల టాప్ తో దుమారం రేపింది. క‌ళ్ల‌కు  బ్లాక్ రేబాన్ క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి మంటలు పుట్టించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌గ్య త‌దుప‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టించ‌నుంది. అలాగే స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న యాంటిమ్ లోనూ ప్ర‌గ్య ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. మంచు కాంపౌండ్ లోనూ ఢీ అనే సినిమా చేస్తోందని క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News