ఈ మధ్య కాలంలో సినిమాలను చూస్తే చాలు.. కంటెంట్ ఎలా ఉన్నా కూడా వెనుక ఉన్న టెక్నీషియన్ల గురించి చాలా సందేహాలు వస్తుంటాయి. ఎందుకంటే అక్కడ పేరు ఒకరిది ఉంటే ఇక్కడ సౌండ్ మరొకరిది వినిపస్తుంటుంది కాబట్టి.
ఆ మధ్యన 'శంకరాభరణం' మేకింగ్ వీడియోలను చూసినప్పుడు అందరికీ ఇదే సందేహం వచ్చింది. అసలు ఆ సినిమాకు దర్శకుడు ఉదయ్ నందనవనం అనే కొత్త డైరక్టరా? లేకపోతే నిర్మాత కం రైటర్ కం మ్యాజిక్ క్రియేటర్ కోన వెంకటా? అనే డౌటు రేకెత్తింది. ఇప్పుడు మరో సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఈసారి సినిమా పేరు 'సైజ్ జీరో'. ఈ సినిమాను డైరక్టు చేసింది కె.రాఘవేంద్రరావు కొడుకు ప్రకాస్ కోవెలమూడి. ఎన్నోసార్లు డైరక్టర్ గా నిలదొక్కుకోవాలని ట్రై చేసి ఇప్పుడు భార్య కనికా థిల్లాన్ అందించిన స్ర్కిప్టుతో అనుష్కను హీరోగా పెట్టి ఈ సినిమాను తీస్తున్నాడు. అయితే మేకింగ్ షాట్లు చూస్తుంటే.. ఈ సినిమాకు కనికా దర్శకత్వం వహించిందని అనిపించక మానదు.
ఎనీవే.. ఈ సైజ్ జీరో సినిమాతో ప్రకాష్ కు మాత్రం సైజ్ హండ్రెడ్ రేంజ్ హిట్టు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఒక ఐకానిక్ డైరక్టర్ తనయుడు సక్సెస్ అయితే అంతకంటే కిక్ ఇంకోటి ఉండదు. కాబట్టి.. రాఘవేంద్ర రావు కొడుకు కొట్టినా కోడలు కొట్టినా.. హిట్టు హిట్టే.