నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు డ్రైవింగ్ లో ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాడు. డ్రైవింగ్ అంటే సాధారణ బైక్ నో - కార్ నో డ్రైవ్ చేయడం కాదు. ప్రపంచప్రఖ్యాతి చెందిన మోటోక్రాస్ బైకింగ్ లో మెళకువలు నేర్పించేస్తున్నాడు. ప్రీతం గబ్బి తీస్తున్న కన్నడ మూవీ 'నన్ను మత్తు వరలక్ష్మి' చిత్రంలో బైకర్స్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా ప్రకాష్ రాజ్ యాక్ట్ చేస్తున్నాడు.
హీరో పాత్ర కుర్ర రైడర్ గా కొత్త నటుడు పృథ్వి నటిస్తున్నాడు. పృథ్వీ - ప్రకాష్ రాజ్ లు ఇప్పటికే బైకులపై చక్కర్లు కొట్టేస్తుండగా.. ఈ మూవీ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నాడు ఈ విలక్షణ నటుడు. సాధారణంగా యూఎస్ - మెక్సికో ప్రాంతాల్లో కనపడే ఈ బైకింగ్.. చాలా వినూత్నమైన కాన్సెప్ట్. దీని కోసం హీరోతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఫీట్స్ చేయాల్సి ఉంటుంది. వాటికి అంగీకరించిన ప్రకాష్ రాజ్ కి.. ఈ సినిమాలో బైక్ తో 20 అడుగుల లాంగ్ జంప్ చేసే సన్నివేశం కూడా ఉంటుందట.
ఇప్పటికే ఊటీ పరిసరాల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అక్కడికి చుట్టుపక్కలే తెరకెక్కిస్తున్నారు. ఒకో ఏరియాకి మధ్య 40కి.మీ. దూరం ఉండగా.. ఆ మొత్తం దూరాన్ని ప్రకాష్ రాజ్ బైక్ పైనే చుట్టేస్తున్నాడట. సాధారణంగా బైకింగ్ అంటే ఇష్టపడే ప్రకాష్ రాజ్.. ఇప్పుడు అదే పాత్రను పోషిస్తుండడంతో.. మరింత పర్ఫెక్ట్ నెస్ కోసం ఇలా బైక్ పైనే తిరిగేస్తున్నాడు.