మీటూ ఉద్యమంలో భాగంగా కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ స్టార్ హీరో అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. తనను లైంగికంగా వేదించాడంటూ అర్జున్ పై శృతి హరిహరన్ ప్రకటించిన వెంటనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ఇంకా పలువురు మద్దతు ప్రకటించారు. శృతికి వెంటనే అర్జున్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తనకు మద్దతుగా నిలిచినందుకు ప్రకాష్ రాజ్ తో పాటు ఇతరులకు కూడా శృతి కృతజ్ఞతలు చెప్పిన విషయం తెల్సిందే. దాంతో అర్జున్ పై ఆరోపణల వెనుక ప్రకాష్ రాజ్ ఉన్నాడనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారంను శృతి కూడా కొట్టి పారేసింది.
ప్రకాష్ రాజ్ తనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో అర్జున్ విషయంలో మాట మార్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా అర్జున్ లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని తాను అనలేదని, ఆయన్ను నేనెప్పుడు నిందితుడిగా చూడలేదని పేర్కొన్నాడు. నాకు అర్జున్ మంచి స్నేహితుడు - సహ నటుడు - సినీ రంగంలో ఉన్న తామిద్దరం ఒకరికి ఒకరు బాగా తెలుసు. శృతి ఆరోపణల కారణంగా ఇద్దరిని ఒక వేదికపైకి తీసుకు వచ్చి వివాదాన్ని పరిష్కరించాలని తాను సూచించానని, ఇద్దరిలో ఏ ఒక్కరికో తాను మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నాడు.
కన్నడ సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న ఈ అంశంకు ముగింపు పలకాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అంబరీస్ ఈ విషయమై ఇద్దరితో చర్చించారు. అయితే వారిద్దరు కూడా రాజీకి నో అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇద్దరు కూడా న్యాయ పోరాటానికే ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో శృతి హరిహరన్ తో ప్రకాష్ రాజ్ మాట్లాడాలని కొందరు కోరుకుంటున్నారు. మరి ప్రకాష్ రాజ్ రాజీకి ప్రయత్నిస్తాడా, అంబరీష్ చేయలేని రాజీ ప్రకాష్ రాజ్ వల్ల సాధ్యం అయ్యేనా చూడాలి.