విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన సినిమాలతోనే కాకుండా అప్పుడప్పుడు వివాదాలతో కూడా మీడియా ముందుకు వస్తూ ఉంటాడు. తాజాగా ఈయన ‘హలో గురు ప్రేమకోసమే’ అనే చిత్ర షూటింగ్ సందర్బంగా కమెడియన్ సప్తగిరిపై చేయి చేసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిప్పులేనిదే పొగ రాదని, సప్తగిరి కాస్త అతి చేసేందుకు ప్రయత్నించడంతో ప్రకాష్ చెంపపై ఒక్కటి ఇచ్చి ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. దిల్ రాజు ఆదేశాల మేరకు ఎవరు ఈ విషయాన్ని మీడియా ముందు మాట్లాడటం లేదని ఫిల్మ్ సర్కిల్ లో చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో స్వయంగా ప్రకాష్ రాజ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఒక జాతీయ స్థాయి మీడియా సంస్థతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ సెట్ లో జరిగిన విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
సప్తగిరిని తాను కొట్టినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నూటికి నూరు శాతం తప్పు. తాను ఎందుకు అతడిని కొడతాను, ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్న వ్యక్తి అతను. ఇప్పుడే అతడు దర్శకత్వం కూడా మొదలు పెట్టాడు. ముందు ముందు అతడి సినిమాల్లో నేను నటిస్తాను. దర్శకుడిగా మారబోతున్నట్లుగా తెలియడంతో శుభాకాంక్షలు కూడా చెప్పాను అంటూ ప్రకాష్ రాజ్ అన్నాడు.
ఇద్దరి మద్య ఏ వివాదం లేనిది ఎందుకు ఈ పుకార్లు పుట్టాయి అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. గతంలో ప్రకాష్ రాజ్ ఇదే సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో కూడా విభేధించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కూడా పుకార్లే అంటూ చిత్ర యూనిట్ సభ్యులు కొట్టి పారేశారు. అయితే సినీ వర్గాల్లో మాత్రం ప్రకాష్ రాజ్ వారితో గొడవ పడే ఉంటాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఏది నిజమో, ఏది అబద్దమో భవిష్యత్తులో అయినా తెలియడం ఖాయం.