గత రెండు నెలల్లో తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ మీద మామూలు రగడ జరగలేదు. ఒక దశలో వేళ్లన్నీ ఇండస్ట్రీ వైపే నిలిచాయి. కానీ పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి బూతు తిట్టడంతో కథ మలుపు తిరిగింది. ఆమెను తిట్టే క్రమంలో అందరూ మీడియా మీద పడ్డారు. మీడియాను దోషిగా నిలబెట్టేశారు. అసలు సమస్య పక్కకు వెళ్లిపోయింది. ఇండస్ట్రీలో అసలు కాస్టింగ్ కౌచే లేదన్నట్లు.. ఇక్కడి వాళ్లందరూ శుద్ధ పూసలన్నట్లు కలరింగ్ మొదలైంది. వరుస బెట్టి టాలీవుడ్ ప్రముఖులందరూ మీడియాకు క్లాసులు పీకడం మొదలుపెట్టారు. మీడియా మీద నిషేధాజ్ఞలు విధించాలన్న చర్చా నడుస్తోంది. ఇలాంటి తరుణంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై పూర్తి భిన్నంగా స్పందించాడు. ఆయన రివర్సులో ఇండస్ట్రీ జనాలకే క్లాస్ పీకాడు.
అసలు శ్రీరెడ్డి ఆవేదనను ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రకాష్ రాజ్ ప్రశ్నించాడు. ఒక మహిళ ఏడుస్తున్నపుడు కచ్చితంగా ఆమె బాధేంటో తెలుసుకోవాలన్నాడు. ఎవరు ఆరోపణలు చేస్తున్నారు. ఏ రీతిలో చేస్తున్నారు అన్నదానికంటే ఆమె ఏమంటోందన్నది చూడాలన్నాడు ప్రకాష్ రాజ్. నిజాలేంటి? నిజంగా ఇండస్ట్రీలో ఇలాంటివి జరగట్లేదా? అన్నది ఆలోచించి.. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలన్నాడు. అంతే తప్ప ఆరోపణలు చేసిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేయొద్దన్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్య అని.. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న మాట వాస్తవమని ఆయన కుండబద్దలు కొట్టారు. మీడియా మీద ఆంక్షలు విధించడం ద్వారా ఇండస్ట్రీ ఏం సాధిస్తుందంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. మరోవైపు ఆయన భారతీయ జనతా పార్టీ మీద.. మోడీ మీద యధావిధిగా విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో బీజేపే గెలిచే అవకాశమే లేదని ఆయన జోస్యం చెప్పారు.