వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కు సాహిత్యం పట్ల, దేశ రాజకీయాల పట్ల అపారమైన అనుభవం, విషయ పరిజ్ఞానం వున్న విషయం చాలా మందికి తెలిసిందే. ఆయన చుట్టూ వున్న వాళ్లకు, ఆయనని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన వాళ్లకు, ఆయనతో కలిసి సినిమాల్లో పని చేసిన కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, దిల్ రాజు లాంటి వాళ్లు ఈ విషయం బాగా తెలుసు. ఏ విషయంపై అయినా అనర్గళంగా మాట్లాడే ప్రకాష్ రాజ్ దేశ రాజకీయాలపై సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో జస్ట్ ఆస్కింగ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అంతే కాకుండా గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా పలు సామాజిక అంశాలపై సూటిగా ప్రశ్నాస్త్రాలని సంధిస్తున్నారాయన. జస్ట్ ఆస్కింగ్ అంటూ కేంద్రంలో వున్న బిజేపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై సైతం నేరుగా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా హీరో విశాల్ పై అలాంటి వ్యగ్యాస్త్రాన్ని సంధించి ఔరా అనిపించారు.
వివరాల్లోకి వెళితే.. హీరో విశాల్ ఇటీవల కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మారిన పరిసరరాలు, యాత్రికుల పట్ల ఏర్పడిన సానుకూలతకు విశాల్ ముగ్ధుడయ్యాడట. గతంలో పోలిస్తే కాశీలో జరిగిన అభివృద్దిని చూసి విశాల్ ఆశ్యర్యపోయాడట.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడి కాశీ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన తీరుపై విశాల్ ప్రశంసలు కురిపిస్తూ 'ప్రియమైన మోదీజీ నేను కాశీని దర్శించుకున్నాను. అక్కడ అద్భుతంగా దర్శనం జరిగింది.
పవిత్ర గంగానది జలాన్ని తాకాను. ఆలయాల పునరుద్దరించడం ద్వారా మీరు చేసిన అభివృద్ధికి ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గతం కంటే కాశీ ఇప్పుడు అద్భుతంగా వుంది. ఇప్పడు కాశీ ప్రయాణం కూడా సులువుగా మారింది. అందుకు మీకు నమస్కరిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశాడు విశాల్. ఈ ట్వీట్ పై ప్రధాని మోదీ రిప్లై ఇచ్చారు. మీరు కాశీలో అద్భుతమైన అనుభవం పొందినందుకు ఆనందంగా వుందన్నారు.
అయితే విశాల్ చేసిన ట్వీట్ పై ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు, ఆయన సమయస్ఫూర్తి బైండ్‌బ్లోయింగ్ అని చెబుతున్నారు. ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో వ్యగ్యంగా 'షాట్ ఓకే నెక్స్ట్? ' అంటూ టెర్రిఫిక్ గా రిప్లై ఇవ్వడంపై కామెంట్ లు పడుతున్నాయి. విశాల్ యాక్టింగ్ చించేశాడనా ప్రకాష్ రాజ్ ఉద్దేశం? అంటూ కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.