ఈ జన్మమే రుచి చూడటానికే దొరికెరా దొరికెరా... ఈ లోకమే వండి వార్చడానికి వేదిక రా.... అంటూ ఆమధ్య ప్రకాష్ రాజ్ తెలుగు - కన్నడం - తమిళం భాషల్లో `ఉలవచారు బిర్యానీ` వండి వర్చాడు. కానీ ఆ వంటకం జనాలకే అస్సలు నచ్చలేదు. ఏదో తక్కువైందన్నట్టుగా తిరస్కరించేశారు. మలయాళంలో విజయవంతమైన సాల్ట్ పెప్పర్ కి రీమేక్ అయిన ఈ చిత్రంపై ప్రకాష్ రాజ్ చాలా ఆశలే పెట్టుకొని స్వయంగా తెరకెక్కించాడు. నిర్మాతగా కూడా ఆయన ఓ హ్యాండేశాడు. కానీ ఏ రకంగానూ ఆ సినిమా సంతృప్తినివ్వలేదు. అయినా సరే... ఆ కథపై మమకారం చంపుకోలేదు ప్రకాష్ రాజ్. బిర్యానీని వండాల్సిందే, హిట్టు చేయాల్సిందే అని డిసైడైయ్యాడు.
అందుకే ఈసారి హిందీలో సినిమాని తెరకెక్కించాలని ఫిక్సయిపోయాడు. ఇక్కడ తాను పోషించిన పాత్రకి నానా పటేకర్ నీ - స్నేహ పోషించిన పాత్రకి శ్రియనీ - మరో యంగ్ హీరోయిన్ పాత్రలో తాప్సినీ ఎంపిక చేసుకొని సినిమాని తీయడానికి సిద్ధమైపోయాడట ప్రకాష్ రాజ్. స్వీయ దర్శకత్వంలోనే ఆయన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. `తడ్క` పేరుతో హిందీలో సిద్ధం కానున్న ఉలవచారు బిర్యానీ వంటకం అక్కడి ప్రేక్షకుల్నయినా మెప్పిస్తుందో లేదో చూడాలి. ప్రకాష్‌రాజ్ ప్రస్తుతం తెలుగు - కన్నడ భాషల్లో మన ఊరి రామాయణం అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగానే హిందీ ప్రాజెక్టుని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.