విలక్షణమైన నటనతో వెర్సటైల్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు నటుడు ప్రకాష్ రాజ్. తమిళ చిత్రాల నుంచి బాలీవుడ్ దాకా తనదైన మార్కు నటనతో పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. కర్ణాటక బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీగా పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. అక్కడ గెలుపుని అందుకోలేకపోయిన ప్రకాష్ రాజ్ తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.
ఇప్పటికే తన ప్యానెల్ ని ప్రకటించి పలువురిని ఆశ్చర్యపరిచారు కూడా. ప్రకాష్ రాజ్ కు పోటీగా అధ్యక్ష పదవి కోసం హీరో మంచు విష్ణు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ అడ్వకేట్ సీవీఎల్ నరసింహరావు కూడా పోటీపడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంతో సీవీఎల్.., మా బిల్డింగ్ కట్టిస్తానంటూ మంచు విష్ణు తమ ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ ఇద్దరికి పూర్తి భిన్నంగా ప్రకాష్ రాజ్ తనదైన వాక్చాతూర్యంతో పదునైన పంచ్ డైలాగ్ లతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇది ఒక యుఎస్ అధ్యక్ష ఎన్నిక కాదని.. `మా` అధ్యక్షుడిగా లేదా `మా` సభ్యుడిగా ఉంటాను అని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. తాజాగా ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. `మా`లో ఎంత మంది సభ్యులు యాక్టీవ్ గా వున్నారో.. ఎంత మంది కనీసం ఓటు వేయడానికి రారో.. ఎంత మంది `మా`కు ఉపయోగం లేదో స్పష్టం చేసి ఒక విధంగా షాకిచ్చారు. హీరోలు రామ్ చరణ్,.. నాగ చైతన్య వంటి వారు ఎన్నికల్లో ఎలా ఓటు వేయలేదో తెలుసుకోవడానికి తాను 6 నెలల గ్రౌండ్ వర్క్ చేశానని ప్రకాష్ వెల్లడించడం చాలా మందిని విస్మయానికి గురిచేసింది. అయితే.. `మా` సభ్యులు ప్రకాష్ రాజ్ చెప్పిన లాజికల్ స్టేట్ మెంట్ లను చాలా ఎన్నికల్లో వింటూ వస్తున్నారు. అయితే వారికి లాజిక్ కంటే మ్యాజిక్ అవసరం.
ప్రకాష్ రాజ్ 100 మంది సభ్యులతో డాక్టర్స్ క్లబ్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ సేవలను వినియోగించుకోవడానికి సభ్యులకు ప్రత్యేకంగా హెల్త్ కార్డులు ఇస్తారట. నేరుగా సభ్యులు ఆసుపత్రికి వెళ్లవచ్చు. వారు దానిని అక్కడ స్వైప్ చేసినప్పుడు అది అసోసియేషన్ కు తెలుస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. డబ్బు సంపాదించడానికి.. `మా` కోసం 10 కోట్ల నిధిని సృష్టించడానికి,.. మణిరత్నం బ్యాచ్ `నవరస` ఎలా చేసారో అదే తరహాలో `మా` ఫండింగ్ కోసం మహేష్.. ఎన్టీఆర్ లని సంప్రదిస్తానని చెప్పారు ప్రకాష్ రాజ్. `నవరస` ద్వారా వచ్చిన మొత్తం 26 కోట్ల లాభాన్ని కరోనా బాధితుల కోసం విరాళంగా ఇచ్చేశారు. అది ఒక అద్భుతమైన ఆలోచనలా అనిపించింది.
గతంలో రాజేంద్ర ప్రసాద్ వంటి వారు తమ ప్రచార సమయంలో తమకు చాలా మంది సీఎం లతో అగ్రతారలతో మంచి అనుబంధం వుందని, వారి ద్వారా `మా`కు నిధులు సమకూరుస్తామని పేర్కొన్నారు. కానీ చివరికి ఏమీ చేయలేకపోయారు. అవసరమైన కళాకారులకు సహాయం చేయడానికి `మా` కి నిధుల కొరత ఏర్పడింది. ప్రణాళికాబద్ధంగా `మా` కోసం నిధులు సమకూరుస్తామని చెప్పిన యుఎస్ టూర్ ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయారు. అయితే ఇక్కడో విషయం స్పష్టం ప్రకాష్ రాజ్ ఇన్ని లాజిక్ లు చెబుతున్నా ఆయన మ్యాజిక్ ఫిలిస్తేనే అద్భుతం జరుగుతుంది. లేదంటే గత పాలక వర్గం తరహాలోనే మళ్లీ పాత పాటే పాడల్సి వస్తుంది.
ఇన్ని తెలిసిన ప్రకాష్ రాజ్ లాజిక్ కి మ్యాజిక్ కి పొంతన లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? .. తన లాజిక్ తో ఇంతకీ అనుకున్న మ్యాజిక్ ని చేసి చూపిస్తారా? అన్నది `మా` సబ్యుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా వేధిస్తోంది. ఆ అనుమానాలని ప్రకాష్ రాజ్ తన చేతలతో పటా పంచలు చేస్తారా? లేక తనదైన మార్కు డైలాగులతో మాయ చేస్తారా? అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.