మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో బ్రహ్మోత్సవం చేస్తున్నాడు. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరి ప్రణీత నటిస్తోంది. పవన్ తో అత్తారిటింకి దారేది తర్వాత ఆమెకు వచ్చిన మరో భారీ ఆఫర్ ఇది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ప్రణీత మనసుకు అతి దగ్గరైన ఓ ప్రాణి, ఈ ప్రపంచానికి దూరం కావడంతో, మొత్తం యూనిట్ అంతా నివాళి అర్పించారు.
రీసెంట్ గా ఓ కుక్కను దగ్గరకు తీసుకుని ప్రణీత కౌగిలించుకున్న ఫోటోని స్వయంగా పోస్ట్ చేసింది. అకితా అనే రకానికి చెందిన జపనీస్ మౌంటెన్ డాగ్ తో ప్రణీత ఫోటో.. నెట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ఈ ఫోటోని ఎందుకు షేర్ చేయాల్సి వచ్చిందో.. ప్రణీత ఓసారి వివరిచింది. 'గతంలో నా దగ్గర సాషే అనే కుక్క ఉండేది. ఇది జర్మన్ షెప్పర్డ్. సాషే మా ఇంటికి వచ్చేవరకూ నేను కుక్కలంటే అంతగా ఇష్టపడేదాన్ని కాదు. మా ఇంట్లో కూడా అప్పటివరకూ ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ గత అక్టోబర్ సాషే మా అందరికీ దూరమైంది' అని చెప్పింద ప్రణీత.
ఆ తర్వాత ఈ అకితా రకానికి చెందిన కుక్క ఓ పొలంలో దొరికిందట. దానికి గ్రిజ్లీ అనే పేరు పెట్టుకున్నామని చెబుతోంది. సాషే దూరమయ్యాక బాధలో ఉన్న సమయంలో గ్రిజ్లీ బాగా దగ్గరయిపోయిందట. అయితే ఇప్పటికీ సాషేను రీప్లేస్ చేయడం ఎవరి వల్లా కాదంటుంది ఈ వయ్యారి. తను ఎవరికీ మచ్చిక కాలేదని, కాను తనను మాత్రం ఎప్పుడూ వెన్నంటే ఉండేదని చెబుతోంది ప్రణీత.