ఈ టైమ్‌ లో నాగ్‌ రిస్క్... ఆయన నమ్మకానికి అంతా షాక్‌

Update: 2022-12-08 01:30 GMT
టాలీవుడ్‌ కింగ్ నాగార్జున ఒక కమర్షియల్ బ్లాక్‌ బస్టర్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. బంగార్రాజు సినిమాతో డీసెంట్‌ హిట్ ను దక్కించుకున్న నాగార్జున ది ఘోస్ట్‌ సినిమా తో నిరాశ పర్చాడు. ఏమాత్రం ఆకట్టుకోని ఆ సినిమా కలెక్షన్స్ మరీ దారుణంగా నమోదు అయ్యాయి.

ది ఘోస్ట్‌ సినిమా ఫలితం తర్వాత నాగార్జున తదుపరి సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని భావించాడట. అందులో భాగంగానే చాలా కథలు విన్న తర్వాత ఎట్టకేలకు ప్రసన్నకుమార్ బెజవాడ చెప్పిన కథ కు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

సినిమా చూపిస్తా మావా కి కథ అందించిన ప్రసన్న కుమార్‌ బెజవాడ ఈ సినిమా తో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రచయితగా సుదీర్ఘ కాలం అనుభవం ఉన్న ప్రసన్న కుమార్‌ ఈ సినిమా తో దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. నాగార్జున ఇప్పటికే కొత్త దర్శకులను ఎంతో మందిని పరిచయం చేశాడు. ఇప్పుడు మరోసారి కొత్త దర్శకుడితో నాగార్జున సినిమా చేయబోతున్నాడు.

పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నాగార్జున తో సినిమా రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. భారీ వీఎఫ్‌ఎక్స్ ఈ సినిమాలో ఉండబోతుందని.. వీఎఫ్‌ఎక్స్ కోసమే ఈ సినిమా బడ్జెట్‌ లో మెజార్టీ పార్ట్‌ ను ఖర్చు చేయబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఈ సినిమాను నాగార్జున సొంత బ్యానర్‌ లో నిర్మిస్తాడట. ఈ మధ్య కాలంలో నాగార్జున సినిమాల మార్కెట్ తగ్గింది. ఇలాంటి సమయంలో భారీ బడ్జెట్‌ తో సినిమా చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నాగార్జున చాలా పెద్ద రిస్క్‌ చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. కొత్త దర్శకుడిపై నాగ్ పెట్టుకున్న నమ్మకానికి అంతా షాక్ అవుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News