బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను చేశాడు.. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాకముందే రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో అంటూ క్లారిటీ వచ్చింది. మహేష్ బాబు తర్వాత సినిమా ఏంటి అనే విషయం లో రాజమౌళి నుండి ఎలాంటి క్లారిటీ లేదు. కనుక ఆయన అభిమానుల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కాని కేజీఎఫ్ దర్శకుడి విషయంలో అభిమానులు గందరగోళంలో ఉన్నారు.
కేజీఎఫ్ 2 సినిమా విడుదల కాకుండానే సలార్ సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. సలార్ సినిమా ఇప్పటికే 30 శాతం వరకు పూర్తి అయ్యిందని వార్తలు వస్తున్నాయి. సలార్ సినిమాను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. మేకర్స్ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత చేయబోతున్న సినిమా ఏంటీ అనే విషయం లో ఒక క్లారిటీ రావడం లేదు.
నిన్న మొన్నటి వరకు ఎన్టీర్ 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తన సలార్ తర్వాత సినిమా గా చేస్తాడని అంతా భావించారు. కాని ఇప్పుడు కేజీఎఫ్ నిర్మాత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత చేయబోతున్న సినిమా కేజీఎఫ్ 3 అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. దాంతో ఎన్టీఆర్31 సినిమా పరిస్థితి ఏంటీ అంటూ అంతా కూడా గందరగోళంలో ఉన్నారు.
కేవలం ఎన్టీఆర్ సినిమా మాత్రమే కాకుండా రామ్ చరణ్ తో కూడా ఒక సినిమాను చేసేందుకు ప్రశాంత్ నీల్ కమిట్ అయ్యాడు. అందుకు సంబంధించిన అడ్వాన్స్ ను కూడా తీసుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాను పక్కకు పెట్టే ఛాన్స్ లేదు. కనుక చరణ్ తో ఎప్పుడు సినిమా తీస్తారు అంటూ ప్రశాంత్ నీల్ ను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.
ఆ మద్య మహేష్ బాబుతో కూడా ప్రశాంత్ నీల్ సినిమా అన్నారు. తమిళ హీరోలు మరియు బాలీవుడ్ హీరోలతో కూడా ఈ యన సినిమాలు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. ఇన్ని సినిమాలు ఉన్న సమయంలో ఏ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఎవరితో ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కబోతుంది అనే విషయాలపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.
జాతీయ మీడియా నుండి గల్లీ మీడియా వరకు ప్రశాంత్ నీల్ సినిమాల లైనప్ గురించి మాట్లాడుతున్నారు. కనుక ప్రశాంత్ నీల్ ఆ విషయమై క్లారిటీ ఇవ్వాలని అంతా కోరుకుంటున్నారు. అందరు ఏమో కాని ఎన్టీఆర్ 31 ఎప్పుడు ఉంటుంది అనే విషయం లో క్లారిటీ ఇవ్వాల్సిందిగా చాలా మంది కోరుతున్నారు.