NTRతో KGF డైరెక్ట‌ర్ డ్యాన్స్ బేస్డ్ మూవీ?

Update: 2019-07-24 17:30 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ఏడాది చివ‌రి నాటికి టాకీ పార్ట్ పూర్త‌వుతుంది. అప్ప‌టివ‌ర‌కూ యంగ్ య‌మ ఎన్టీఆర్ వేరొక ప్రాజెక్టుపై దృష్టి సారించే అవ‌కాశం లేదు. అయితే ఎన్టీఆర్ ఈలోగానే ఓ ద‌ర్శ‌కుడి విష‌యంలో ఎంతో ఆస‌క్తిగా ఉన్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఆర్.ఆర్.ఆర్ లో త‌న పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌గానే అత‌డు కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో స్క్రిప్టు సెష‌న్స్ లో పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు క‌థ వినిపిస్తే తాను సిద్ధ‌మేన‌ని తార‌క్ ప్రామిస్ చేశార‌ని మైత్రి అధినేత‌ నవీన్ ఎర్నేని ఇదివ‌ర‌కూ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ప్ర‌స్తుతం ఆ ప్రాజెక్టు కోసం ప్ర‌శాంత్ నీల్ క‌థ‌ను రెడీ చేస్తున్నారు. ఓవైపు కేజీఎఫ్ సీక్వెల్ ని తెర‌కెక్కిస్తూనే.. తార‌క్ - మైత్రి మూవీ మేక‌ర్స్ ప్రాజెక్ట్ పైనా ప్ర‌శాంత్ నీల్ ఆలోచిస్తున్నార‌ట‌. తాజాగా ఈ క్రేజీ కాంబినేష‌న్ లో ఎలాంటి సినిమా తెర‌కెక్క‌నుంది? అన్న‌దానికి ఓ ఆస‌క్తిక‌ర అప్ డేట్ తెలిసింది.

ఎన్టీఆర్ హీరోగా ఓ డ్యాన్స్ బేస్డ్ మూవీని కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. స్టోరి లైన్ ఏమిటి? అన్న‌ది ఇంకా రివీల్ కాలేదు. అయితే తార‌క్ అన‌గానే డ్యాన్సుల్లో స్పెష‌లిస్ట్. భార‌త‌దేశంలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్స‌ర్ గా అత‌డికి గుర్తింపు ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌శాంత్ నీల్ తెలివిగా ఈ త‌ర‌హా కాన్సెప్టును రెడీ చేస్తున్నాడా? అంటూ అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది. అలాగే డ్యాన్స్ బేస్డ్ సినిమా అంటే హాలీవుడ్ లో స్టెప‌ప్ సిరీస్.. బాలీవుడ్ లో ఏబీసీడీ సిరీస్ గుర్తుకొస్తాయి. టాలీవుడ్ లో లారెన్స్ మాస్టార్ తెర‌కెక్కించిన `స్టైల్` మూవీ గుర్తుకు వ‌స్తుంది. వాట‌న్నిటి కంటే డిఫ‌రెంట్ గా తార‌క్ కోసం ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తారు? అన్న‌ది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News