కుర్ర డైరెక్ట‌ర్ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్

Update: 2021-01-03 17:30 GMT
అ! సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన ప్ర‌శాంత్ వ‌ర్మ చాలా ఆత్మ‌విశ్వాసంతో క‌నిపిస్తుంటాడు. ఆ సినిమా ప్ర‌మోష‌న్ల సంద‌ర్భంగా అత‌డి ఇంట‌ర్వ్యూలు అవీ చూస్తే కొత్త ద‌ర్శ‌కుడిలో ఉండే నెర్వ‌స్‌ నెస్ ఎంత‌మాత్రం క‌నిపించ‌లేదు. ఈ త‌రం కాన్ఫిడెంట్, అగ్రెసివ్ కుర్రాళ్ల‌కు ప్ర‌తినిధిలా క‌నిపించాడ‌త‌ను. తొలి సినిమా క‌మ‌ర్షియ‌ల్‌ గా అనుకున్నంత స‌క్సెస్ కాక‌పోయినా ప్ర‌శంస‌లు, అవార్డులు బాగానే వ‌చ్చాయి. ఆ ఊపులో సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్‌తో క‌ల్కి తీశాడు. ఈ సినిమా స‌మ‌యంలోనూ ప్ర‌శాంత్ వ‌ర్మ చాలా కాన్ఫిడెంట్‌ గా క‌నిపించాడు. కానీ ఆ సినిమా అంచ‌నాల్ని అందుకోలేక‌పోయింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వీకెండ్‌ కు మించి నిల‌వ‌లేక‌పోయింది. అయినా ప్ర‌శాంత్ కెరీర్ ఏమీ ఆగిపోలేదు. క‌రోనా టైంలో జాంబీ రెడ్డి అనే సినిమా మొద‌లుపెట్టి చ‌క‌చ‌కా పూర్తి చేశాడు.

ఇప్పుడీ సినిమా ట్రైల‌ర్ రిలీజైంది. తెలుగులో ఇప్ప‌టిదాకా ఎవ‌రూ తీయ‌ని జాంబీ కాన్సెప్ట్‌ తో ఈ సినిమా తీశాడు ప్ర‌శాంత్. ట్రైల‌ర్ చూస్తే సినిమా అంతా గోల గోల‌గా ఉండేట్లు క‌నిపించింది. కొన్ని స‌న్నివేశాలు మ‌రీ లౌడ్‌గా ఉన్నాయి. ట్రైల‌ర్ క‌ట్ చేసిన తీరు చూస్తే ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేసేస్తుంద‌నే కాన్ఫిడెన్స్ ప్ర‌శాంత్‌లో క‌నిపించింది. కానీ మ‌రీ వ‌యొలెంట్‌ గా - కొంత జుగుప్సాక‌రంగా ఉన్న స‌న్నివేశాల‌ను మ‌న ప్రేక్ష‌కులు త‌ట్టుకోగ‌ల‌రా అన్న‌ది డౌట్‌. జాంబీ కాన్సెప్ట్.. దాంతో ముడిప‌డ్డ స‌న్నివేశాలు మ‌నోళ్ల‌కు ఏమాత్రం ఎక్కుతాయో చూడాలి. త‌మిళంలో జ‌యం ర‌వి హీరోగా ఇలాంటి సినిమానే ఒక‌టి తీస్తే అది ఏమాత్రం మెప్పించ‌లేక‌పోయిన సంగ‌తి ప్ర‌స్తావ‌నార్హం. హిందీలో కూడా జాంబీ జాన‌ర్ సినిమాలు అంత‌గా ఆడ‌లేదు. మ‌రి తెలుగులో ఇలాంటి సినిమా తీసి.. ప్రేక్ష‌కులు ప్లెజెంట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్లు చూడాల‌నుకునే సంక్రాంతి సీజ‌న్లో విప‌రీత‌మైన పోటీ మ‌ధ్య సినిమాను రిలీజ్ చేయ‌డ‌మంటే ప్ర‌శాంత్‌ది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ లాగే క‌నిపిస్తోంది. మ‌రి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అత‌డి సినిమా ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో చూడాలి.



Tags:    

Similar News