రొటీన్ కమర్షియల్ ఎంటర్ టెయినర్లకు భిన్నంగా అ! సినిమా తెరకెక్కుతోందని ఫస్ట్ లుక్ నుంచే అర్ధమైపోయింది. నాచురల్ స్టార్ నాని తను నటించకుండా కేవలం నిర్మాతగా ఉండిపోయి సినిమా నిర్మించాడంటే ఈ సినిమా సబ్జెక్ట్ పై అతడికున్న నమ్మకం అర్ధమైపోతుంది. దానికి తగ్గట్టే అ! సినిమా ట్రయిలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండి అందరి దృష్టిని ఆకర్షించింది.
అ! వైవిధ్యమైన స్టోరీ అయినప్పటికీ ఇది ఓ ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టుకొచ్చిందని అంటున్నాడు ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ‘‘2016 డిసెంబర్ 31 రాత్రి ఈ స్టోరీకి మొదటి అడుగు పడింది. నేను డైరెక్ట్ చేస్తానని అన్ని ఆశలు పెట్టుకున్న ఫస్ట్ సినిమా.. సినిమాకు పెట్టుబడి పెట్టేవాళ్లలో ఒకరు ఉన్నట్టుండి పక్కకు తప్పుకున్నాడు. దాంతో ఆ సినిమా ఆగిపోయింది. న్యూ ఇయర్ పార్టీకి ప్లాన్ చేసుకునే మూడ్ కూడా పోయింది. దానిని క్యాన్సిల్ చేసి ఓ కొత్త స్టోరీ రాయడం మొదలెట్టాను. తక్కువ బడ్జెట్ లో పూర్తయ్యేలా.. కొత్త యాక్టర్లతో సినిమా నేను సొంతంగా సినిమా తియ్యాలని డిసైడయ్యాను. ఈ సినిమాతో పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు అన్నింటి దృష్టి పడేలా ఉండాలనే పట్టుదలతో ఈ సినిమా స్టోరీ రాశాను’’ అంటూ ఈ సినిమా వెనుక బ్యాక్ గ్రౌండ్ స్టోరీ చెప్పుకొచ్చాడు.
ముందు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను చిన్నదిగా రూపొందిద్దామని అనుకున్నప్పటికీ నాని ప్రొడ్యూసర్ అయ్యాక పేరున్న యాక్టర్లు స్ర్కీన్ ముందుకు రావడంతో పెద్ద సినిమాగా మారింది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ - నిత్య మీనన్ - ఈషారెబ్బా - రెజీనా కెసాండ్రా - అవసరాల శ్రీనివాస్.. ఇలా భారీ తారాగణమే ఉంది. ఇందులో చేపకు నాని వాయిస్ ఇస్తుండగా.. మొక్కకు మాస్ మహరాజా రవితేజ్ వాయిస్ ఇస్తుండటం విశేషం