విమర్శకులకు నచ్చిన సినిమాలన్నీ జనాలకు నచ్చాలని లేదు. అదే సమయంలో విమర్శకులకు నచ్చని సినిమాల్ని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్న సందర్భాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఏ సినిమా జనాలకు నచ్చుతుంది.. ఏది జనాలు తిరస్కరిస్తారు.. అన్నది చెప్పడం కష్టం. ఐతే గత ఏడాది ప్రవీణ్ సత్తారు అనే టాలెంటున్న డైరెక్టరు తీసిన 'చందమామ కథలు' కమర్షియల్‌గా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేకపోయింది. అందుకు కారణాలేమైనా ఉండొచ్చు కానీ.. దర్శకుడు మాత్రం సమీక్షకులే సినిమాను చంపేశాడంటూ ధ్వజమెత్తాడు. ఎవరో ఓ రివ్యూయర్ డబ్బులు డిమాండ్ చేశాడని.. తాను ఒప్పుకోకపోయేసరికి సినిమాను దారుణంగా తిట్టిపోశాడని చెబుతూ.. అందరూ రివ్యూయర్లరూ ఒకే గాటన కట్టేశాడు.
సినిమా విడుదల సమయంలో సైలెంటుగానే ఉన్న ప్రవీణ్.. తన సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన సమయంలో ఇలా రివ్యూయర్స్‌ను తిట్టిపోశాడు. ఐతే జాతీయ అవార్డులు వచ్చిన సినిమాలన్నీ కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అయిపోతాయని.. అనుకుంటే భ్రమే. కాబట్టి ప్రవీణ్ వాదన ఎంత వరకు కరెక్ట్ అన్నది పక్కనబెట్టేద్దాం. ఇప్పుడీ దర్శకుడు 'గుంటూరు టాకీస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇది తెలుగు సినిమా కమర్షియల్ లెక్కలకు అనుగుణంగా సాగే సినిమా అని అంటున్నాడు ప్రవీణ్. ఇన్నాళ్లూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తే.. జనాలు తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు తాను కూడా అందరి బాటలోనే సాగుతున్నానని చెబుతున్నట్లుంది వ్యవహారం చూస్తుంటే. కొత్తగా ఉందా.. రొటీన్‌గా ఉందా అన్న సంగతి పక్కనబెడితే.. జనాలకు నచ్చేలా ఉండటం ముఖ్యం. అలా ఉంటే ఎవరి ప్రమేయం లేకుండా సినిమా హిట్టయిపోతుంది.