ఏదో ఆవేశంలో నోరు జారేస్తాం కాని కొన్నిసార్లు ఆ మాటలు ఎక్కడికో వెళ్లి ఊహించని పరిణామాలకు దారి తీసి పీకల మీదకు తెస్తాయి. సినిమాల టాక్ - రివ్యూల విషయంలో కొందరు దర్శక నిర్మాతలు ఎంతటి అసంతృప్తితో ఉన్నారో పలు సందర్భాల్లో గమనిస్తూనే ఉన్నాం.వీటికి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. రాజమౌళి - సురేష్ బాబు గతంలో వీటి గురించి కామెంట్ చేస్తూ సినిమా ఎలా ఉంటే అలా రాస్తారని - అందులో తప్పుబట్టడానికి ఏమి లేదని చెప్పిన సంగతి గుర్తే. తాజాగా ఒక ఫిలిం క్రిటిక్ నిర్వహించిన రౌండ్ టేబుల్ డైరెక్టర్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న గరుడవేగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు పైరసీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎన్ ఆర్ ఐల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పిజ్జాకు ఐదు డాలర్లు ఖర్చు చేసి తినే ఎన్ ఆర్ ఐలు సినిమాల విషయంలో మాత్రం పైరసీ ప్రింట్లు డౌన్ లోడ్ చేసుకుని అందరిని పిలిపించి మరీ చూపిస్తారు అని చెప్పడం దుమారం రేపుతోంది.
నిజానికి గరుడవేగా ఓవర్సీస్ లోనే డీసెంట్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఇక్కడే పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కు రాక కొంత నష్టపోక తప్పలేదని ఒక టాక్ ఇప్పటికే ప్రచారంలో ఉంది. పైరసీ అధికంగా ఎన్ ఆర్ ఐల వల్లే వ్యాప్తి చెందుతోంది అన్నట్టు మాట్లాడిన ప్రవీణ్ వాళ్ళను నోటోరియస్ అనడం - ఈ రౌండ్ టేబుల్ వీడియో కాస్తా అందరికి వైరల్ కావడం చకచక జరిగిపోయాయి. ఇంకేముంది ప్రవీణ్ సత్తారు మీద ట్రాల్ మొదలు పెట్టేసారు. కొందరు మాత్రమే అని ఒక్క పదం జత చేస్తే ఏ సమస్యా వచ్చేది కాదు. అందరు అలాగే చేస్తారు అని అర్థం వచ్చేలా కామెంట్ చేయటంతో ఈ చిక్కు వచ్చి పడింది. పైగా తీవ్రమైన నేరాలు చేసినవాళ్ళకు వాడే నోటోరియస్ అనే పదాన్ని వాడటం అభ్యంతరకరంగా మారింది.