ఆల్రెడీ ఆడియన్స్ చూసేసిన సినిమాకు ప్రీ-రిలీజ్ ఈవెంట్..!

Update: 2022-05-27 16:30 GMT
26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు అర్పించిన వీరజవాను మేజర్ ఉన్ని సందీప్ కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ''మేజర్''. సందీప్ పాత్రలో వర్సటైల్ హీరో అడివి శేష్ నటించారు. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ.. జూన్ 3వ తేదీన విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో 'మేజర్' సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పుడు మేకర్స్ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో మే 29న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ విశేషమేమంటే ఆల్రెడీ ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండటం.

విడుదలకు ముందే మే 24 నుంచి 'మేజర్' మూవీ ప్రివ్యూలు ప్రదర్శించబడుతున్నాయి. దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ఈ ప్రివ్యూలు ప్లాన్ చేయగా.. ఇప్పటికే పూణె - అహ్మదాబాద్‌ - లక్నో లలో వేసిన షోలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ - ఢిల్లీ - జైపూర్ - బెంగళూరు - ముంబై - కొచ్చి వంటి నగరాల్లో ప్రివ్యూలు వేయనున్నారు.

ఇలా ప్రివ్యూల ద్వారా ఆల్రెడీ థియేటర్ లలో రిలీజ్ చేయబడిన 'మేజర్' చిత్రానికి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని హీరో శేష్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ''భారతీయ సినీ చరిత్రలో మొదటిసారిగా సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేస్తుండటం. మీరు వారి నిజాయితీ రియాక్షన్ ను ప్రత్యక్షంగా చూస్తారు. ఇది ధైర్యం కాదు. ఇతను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్'' అని పేర్కొన్నారు.

'మేజర్' ఈవెంట్ కు చీఫ్ గెస్టులుగా ఎవరెవరు వస్తారనేది వెల్లడించాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రాన్ని సాదారణ టికెట్ రేట్లతో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు శేష్ తెలిపారు. 'ఇది ప్రతీ భారతీయుడు చూడాల్సిన మన సినిమా. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా సినిమా టికెట్ ధరలను నిర్ణయించాం' అంటూ

తెలుగు రాష్ట్రాల థియేటర్లకు సంబంధించిన టికెట్ ధరల పట్టికను పోస్ట్ చేశారు. ''మేజర్'' చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాని నిర్మించింది. ఇందులో ప్రకాష్ రాజ్ - శోబిత ధూళిపాళ్ల - సయీ మంజ్రేకర్ - రేవతి - మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తెలుగు మలయాళ హిందీ భాషల్లో ఈ బయోపిక్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 'మేజర్' నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News