సొట్టబుగ్గల సోయగం ప్రీతి జింతాని తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ప్రిన్స్ మహేష్ టాలీవుడ్ ఎంట్రీ సినిమా రాజకుమారుడు లో నటించింది. ఈ అమ్మడు నవ్వినప్పుడు చిల్లు బుగ్గలు యూత్ ని తెగ కవ్వించేవి. ఆ తర్వాత వెంకటేష్ సరసన 'ప్రేమతో రా' చిత్రంలో నటించింది. అటుపై బాలీవుడ్ లో బిజీ నాయికగా కెరీర్ ని సాగించింది. అక్కడ ఖాన్ ల త్రయంతో నటించిన ఎక్స్ పీరియన్స్ ని మర్చిపోలేనంటోంది ప్రీతి.
సల్మాన్ ని చూస్తే భయం వేస్తుంది. షారూక్ ని చూస్తే ఏడుపొచ్చేస్తుంది. అమీర్ ని చూస్తే తిట్టబుద్ధేస్తుంది... అంటూ చాలా గమ్మత్తయిన పదజాలం వాడింది ప్రీతిజింతా. ఈ ముగ్గురు హీరోలతో కలిసి నటించిన ఆనంద క్షణాల్ని మర్చిపోలేను. ఒక్కొక్కరూ ఒక్కో తరహా. ఎవరి ప్రత్యేకత వారికి ఉంది.. అని చెప్పింది.
ఓసారి బస్ లో వెళుతూ కునుకు తీసేశా. ఆ టైమ్ లో నోరు చాపి ఉంది. నోట్లో నీళ్లు ఒలకబోశాడు అమీర్. దాంతో కోపం వచ్చేసింది. అతడిపై అరిచేశాను. తిట్టేశాను. ఆ తర్వాత నవ్వేసుకున్నా.. అంటూ ముసిముసిగా నవ్వేసింది. దిల్ చహతా హై చిత్రంలో నటించేప్పుడు ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నానని చెప్పింది. ఖాన్ లతో ఎన్ని తీపి గురుతులో..