నోరు జారీ నాలిక కర్చుకున్న సుందరి

Update: 2018-11-19 13:34 GMT
బాలీవుడ్‌ ను కుదిపేస్తున్న మీటూ వ్యవహారంపై ఎవరు ఏ చిన్న వ్యాఖ్య చేసినా, స్పందన తెలియజేసినా కూడా అది కాస్త వైరల్‌ అవుతోంది. మీటూకు పాజిటివ్‌ గా స్పందించడం కంటే మీటూకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున టార్గెట్‌ చేస్తున్నారు. ఇటీవల సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా ఒక ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి మాట్లాడటం జరిగింది. ఆ సమయంలోనే మీటూ పై స్పందించింది. మీటూ అనేది కొందరు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. నాకు బాలీవుడ్‌ లో లైంగిక వేదింపులు ఎదురు కాలేదు - బాలీవుడ్‌ మహిళలకు చాలా శ్రేయష్కరమైనది అంది.

ప్రీతి జింటా చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. గతంలో నువ్వు నెస్‌ వాడియాపై వేదించాడు అంటూ కేసు పెట్టావు మర్చి పోయావా. అది లైంగిక వేదింపులు కావని నువ్వు ఎలా అనుకుంటావు. నీకు లైంగిక వేదింపులే జరగనట్లుగా నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు అంటూ అంతా ప్రశ్నిస్తున్నారు. దాంతో తన మాటలకు నాలిక కర్చుకున్న ప్రీతి జింటా తన ఇంటర్వ్యూను వారికి అనుకూలంగా మార్చుకుని, ఎడిట్‌ చేసి వదిలారు అంటూ ఆరోపణలు చేసింది.

నన్ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్‌ మోసం చేశాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీటూపై తన ఉద్దేశ్యంను పూర్తిగా తప్పుగా చూపించాడని ప్రీతి ట్వీట్‌ చేసింది. అయితే ఆ జర్నలిస్ట్‌ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన స్పందనపై ప్రీతి అసలు ఏం మాట్లాడినది అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ప్రీతి జింత నిజంగానే అలా మాట్లాడి ఇప్పుడు మాట మార్చి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం నిదానంగా కాలమే నిర్ణయిస్తుంది.

Tags:    

Similar News