రాష్ట్రం కోసం.. ప్రీతి పెళ్ళి ఫోటోలు

Update: 2016-04-22 04:24 GMT
బాలీవుడ్ అంతా కలిసి ఇప్పుడు ఒకే టాపిక్ పై స్పందిస్తోంది. మహరాష్ట్రను కరువు చుట్టుముట్టడంతో.. ప్రజలను ఆదుకునేందుకు బాలీవుడ్ తారలంతా కదిలొస్తున్నారు. ఇలా ఒక సంఘటనకు.. బాలీవుడ్ అంతా ఒకే రకంగా స్పందించడం.. బాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పచ్చు.

కరువు కోరల్లో చిక్కుకున్న జనాలను ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ ఇప్పటికే ఓ గ్రామానికి 50 లక్షల రూపాయలను డొనేట్ చేశాడు. అమీర్ ఖాన్ రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. దీనికి బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ప్రీతి జింటా నాంది పలికింది. రీసెంట్ పెళ్లి చేసుకున్న ఈమె.. ఇప్పుడు తన పెళ్లి ఆల్బంను వేలంలో పెట్టేస్తోంది.

జీనీ గుడ్ఎనఫ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రీతి జింటా.. ఇప్పటివరకూ తన భర్త ఫోటోని ఒక్కటి కూడా బయటకు రానివ్వలేదు. కనీసం పెళ్లి ఫోటోని కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తన పెళ్లి ఫోటోలను వేలం వేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని.. మహరాష్ట్ర లోని కరువు బాధితులైన రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది ప్రీతి జింటా. ఈ మాజీ హీరోయిన్ నిర్ణయంపై ప్రశంసలు వస్తున్నాయి.
Tags:    

Similar News