సాయం కోసం వేలం వేస్తున్న జింటా?

Update: 2016-02-20 09:30 GMT
సమాజానికి తిరిగివ్వడం అనే కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ఊపందుకుంటోంది. తమకు చేతనైతంతలో సాయం చేయాలని కొందరు అనుకుంటుంటే.. తమ ఇమేజ్ ని ఉపయోగించుకుని ఉన్నవాళ్ల దగ్గర నుంచి తీసుకుని, లేనివాళ్లకు సాయం చేయాలని మరికొందరు భావిస్తున్నారు.

హాలీవుడ్ జంటలు జార్జ్ క్లూనీ- అమల్ అలాముద్దీన్, బ్రాడ్ పిట్-ఏంజెలీనా జూలీ జంటలు ఇందుకోసం ఓ మార్గం చూపారు. ఇప్పుడు ఆ దారినే ఫాలో అయిపోతూ.. సమాజానికి సాయం చేయాలని ప్రీతి జింటా, ఆమె కాబోయే భర్త జీనిలు నిర్ణయించుకున్నారు. తమ పెళ్లి ఫోటోలను వేలయం వేయడం ద్వారా వచ్చిన డబ్బును ఛారిటీకి వెచ్చించాలని జింటా జంట డిసైడ్ అయ్యారు. ఈ జంట ఇప్పుడు తమ పెళ్లికి సంబంధించిన ప్రైవేటు ఫోటోలను వేలంలో పెట్టాలని భావిస్తున్నారు. అలా వచ్చిన డబ్బుతో నిరుపేద పిల్లలకు చదువు చెప్పించాలని, వృద్ధాశ్రమాలకు వెచ్చించాలని అనుకుంటున్నారు.

తమకు ఎంతో ఇచ్చిన సమాజానికి, ఈ మాత్రం అయినా సాయం చేసి తిరిగిచ్చే ఓ చిన్న మార్గం ఇది అని వీళ్ల ఉద్దేశ్యం. ఇలా సాయం చేయడం ఓకే కానీ.. ఒక చోట నుంచి తీసుకుని మరోచోట ఇవ్వడంతో పాటు.. సొంతగా కూడా ఏదైనా సాయం చేస్తే మరింత బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్ కోర్స్.. ఈ మాత్రం అయినా సామాజిక స్పృహ ఉండడం మాత్రం అభినందనీయమే.
Tags:    

Similar News