ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ మూవీ రికార్డు గత కొన్నేళ్లుగా అమీర్ ఖాన్ పేరు మీదే ఉంటోంది. ఐతే అతనెప్పుడూ మంచి మంచి సినిమాలే తీస్తాడు. ఆ సినిమాలకు తగ్గట్లే వసూళ్లు వస్తుంటాయి. త్రీ ఇడియట్స్ - ధూమ్-3 - పీకే.. ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సూపర హిట్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కానీ డివైడ్ టాక్ తో మొదలై కూడా వసూళ్ల వర్షం కురిపించడం మాత్రం సల్మాన్ ఖాన్ సినిమాలకు మాత్రమే సాధ్యమేమో. చెత్త సినిమా అని పేరు తెచ్చుకున్న ‘జయహో’ కూడా రూ.130 కోట్లు కొల్లగొట్టడం.. విమర్శకులు విషయం లేదని తేల్చేసిన ‘ఏక్ థా టైగర్’ కూడా 300 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడం దీనికి నిదర్శనం.
తాజాగా డివైడ్ టాక్ తో మొదలైన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ కూడా ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచే వసూళ్లు సాధిస్తోంది. దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా 20 రోజుల్లోనే రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఇందులో ఇండియా వరకు రూ.310 కోట్ల దాకా వసూళ్లు రాటట్టగా.. ఓవర్సీస్ లో రూ. 94 కోట్లు వచ్చాయి. మొత్తం లెక్క రూ.400 కోట్లు దాటింది. ఒకప్పుడు మైనే ప్యార్ కియా - హమ్ ఆప్ హై కౌన్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సల్మాన్ - సూరజ్ బర్జాత్యాల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. టాక్ ఎలా ఉన్నప్పటికీ ఆ కాంబినేషన్ క్రేజ్ కు తోడు సెలవుల అడ్వాంటేజీ తోడై ఈ సినిమా అనూహ్యమైన వసూళ్లు సాధించింది.