ట్రయాంగిల్ లవ్ స్టోరీకి డేటిచ్చారు

Update: 2017-11-03 23:30 GMT
ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు ఏమీ లేకపోవడంతో  టాలీవుడ్ లో చిన్న సినిమాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. మొన్నటి వరకు పెద్ద సినిమాల హావ బాగానే కొనసాగింది. కొంచెం మీడియం మార్కెట్ ఉన్న హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో కొంత లాగారు. ఇక తమవంతు అదృష్టం పరీక్షించుకుంటామని కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు ఈ నెలలో రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యాయి.

అందులో ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అనే సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా నవంబర్ 17న రిలీజ్ కావడానికి రెడీ అయ్యింది. పూర్తిగా నూతన తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. సెప్టెంబర్ లోనే సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు బాగానే కష్టపడ్డారు కానీ కానీ కొన్ని కారణాల వల్ల వీలుపడలేదు. అయితే ఈ సినిమాను ఇంతకుముందే కొంత మంది సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేశారట. వారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

ఈ సినిమా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ తరహాలో గోవర్ధన్ గజాల డైరెక్ట్ చేశాడు. చంద్రకాంత్ - రాధికా మెహ్రోత్ర అండ్ పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ మొత్తం అమెరికాలో జరిపారట. ఇక మొత్తానికి సినిమా అవుట్ ఫుట్ మాత్రం చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. మరి ఎంతవరకు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.    
Tags:    

Similar News