నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో విడుదల అయిన సినిమాల్లో అతి పెద్ద సక్సెస్ ను దక్కించుకున్నది లవ్ స్టోరీ. బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని వసూళ్లను ఈ సినిమా దక్కించుకున్న విషయం తెల్సిందే. చైతూ మరియు సాయి పల్లవిల ప్రేమ కథను తెలుగు ప్రేక్షకులు బాగా ఆధరించారు. అతి త్వరలో ఆహా లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దం అయ్యింది. ఆహా స్ట్రీమింగ్ కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో సినిమాను మలయాళ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్దం అయ్యారు.
తెలుగు సినిమాలు గతంలో చాలా వరకు మలయాళంలో డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అల్లు అర్జున్ కు మలయాళంలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయి పల్లవి కూడా మలయాళంలో స్టార్ హీరోయిన్ అందుకే ఆమె నటించిన లవ్ స్టోరీ సినిమాను అక్కడ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ లవ్ స్టోరీ అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన సాయి పల్లవి మరియు చైతూలు కేరళలో మాత్రం ప్రేమ తీరం అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నారు. ప్రేమ తీరం సినిమాను ఒరిజినల్ మలయాళం మూవీ రేంజ్ లో ఈనెల 29న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న నిర్మాత చెబుతున్నాడు.
ఈనెల 29న అక్కడ భారీ సినిమాలు పోటీగా ఏమీ లేవని.. అందుకే ఆ తేదీని ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విధంగా కేరళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా ఉన్న లవ్ స్టోరీ సినిమా అక్కడ ప్రేమ తీరం గా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అక్కడ నిర్వహిస్తున్నారు. శేఖర్ కమ్ముల ఒక మంచి కథను మెసేజ్ ను ఎంటర్ టైన్ మెంట్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపించిన తీరు కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. కనుక ప్రేమ తీరం సినిమా కూడా మలయాళీలను ఆకట్టుకుంటుందేమో చూడాలి.