ఎంత పెద్ద సినిమాలైనా ఎంత పెద్ద హిట్టయినా రెండు మూడు వారాలకే చాప చుట్టేస్తున్న రోజులివి. ఇలాంటి రోజుల్లో ఓ సినిమా పరాయి రాష్ట్రంలో ఆరు నెలలు దాటాక కూడా ఓ థియేటర్ లో హౌస్ ఫుల్ కావడం అద్భుతమే కదా. ఈ ఘనత మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ సినిమాకే దక్కింది. జూన్ 11న విడుదలైన ఈ సినిమా కేరళలో ఎంత బాగా ఆడుతోందో చెన్నైలోనూ అలాగే ఆడుతోంది. తమిళ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించిన ‘ప్రేమమ్’ చెన్నైలోని రెండు థియేటర్లలో వంద రోజులకు పైగా ఆడటం విశేషం. ఇప్పటికీ అక్కడక్కడా సినిమాను నడిపిస్తున్నారు. ఇటీవలే కొత్తగా ఆరంభమైన లగ్జీరియస్ మల్టీప్లెక్స్ ‘పలాజా’లోనూ ‘ప్రేమమ్’ సినిమాను వేశారు.
చెన్నైలో ఓ వైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ మొన్న ఆదివారం ఈ సినిమా హౌస్ ఫుల్ కావడం విశేషమే. ఈ రోజుల్లో ఆరు నెలల తర్వాత కూడా ఓ సినిమాకు పరాయి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఆదరణ ఉండటం నిజంగా అద్భుతం. ‘ప్రేమమ్’ ఏ స్థాయిలో ప్రేక్షకులకు ఆహ్లాదం పంచుతోందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. అల్ఫాన్సో పుతెరిన్ రూపొందించిన ఈ దృశ్యకావ్యాన్ని మన తెలుగులోకి చందూ మొండేటి.. నాగచైతన్య హీరోగా ‘మజ్ను’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమకథల స్పెషలిస్టు అయిన చైతూతో.. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందూ రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగులోనూ అదే మాదిరి సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.