దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేశారు. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉండగా.. వీలైనంత త్వరగా వాటిని కూడా పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. రాజమౌళి షూటింగ్ ప్లాన్ చూస్తుంటే ముందుగా ప్రకటించినట్లుగానే దసరా కానుకగా అక్టోబర్ 13న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది.
వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే రాజమౌళి.. ఒక సినిమాని కంప్లీట్ చేయడానికి చాలా సమయమే తీసుకుంటాడనే సంగతి తెలిసిందే. ప్రతీ సీన్ పర్ఫెక్ట్ గా రావాలని తపించే జక్కన్న.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు. అందుకే షూటింగ్ పూర్తి చేసిన తర్వాత కూడా రాజమౌళి తన సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ కోసం కొన్ని నెలలు ఎడిటింగ్ టేబుల్ మీద గడుపుతుంటాడు. అందుకే జక్కన్న సినిమాలు విడుదల తేదీని ప్రకటించిన తర్వాత కూడా పలుమార్లు వాయిదా పడుతుంటాయి. ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' విషయంలోనూ ఇదే జరిగింది.
'ఆర్ ఆర్ ఆర్' సినిమా పనులు 2018 నవంబర్ లోనే మొదలు పెట్టారు రాజమౌళి. సుమారు 20 నెలల పాటు ఈ సినిమా షూటింగ్ జరిపారు. సినిమా స్టార్ట్ చేసే సమయంలోనే RRR చిత్రాన్ని 2020 జూలై 30న రిలీజ్ చేస్తామని అగ్ర దర్శకుడు ప్రకటించారు. అయితే షూటింగ్ అనుకున్న విధంగా జరగకపోవడంతో 2021 సంక్రాంతి పండుగ సీజన్ లో జనవరి 8వ తేదీకి ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదలను వాయిదా వేశారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ పరిస్థితుల కారణంగా మరొక సారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా బరిలో నిలవనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ రాకతో మళ్ళీ ట్రిపుల్ ఆర్ పోస్ట్ పోన్ తప్పదని అందరూ అనుకున్నారు. కానీ జక్కన్న మాత్రం చెప్పిన టైం కి రావాలని ఫిక్స్ అయినట్లు అర్థం అవుతోంది.
'ఆర్ ఆర్ ఆర్' సినిమా పెండింగ్ వర్క్ త్వరలోనే పూర్తి చేయాలని రాజమౌళి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ గా పిలవబడే రాజమౌళి డెడ్ లైన్ పెట్టుకొని హడావుడిగా షూటింగ్ చేసే టైప్ కాదనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేయాలని చూస్తున్న జక్కన్న.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అదే విధంగా జరిగేలా చూస్తున్నారు. దీనికి ఎన్టీఆర్ - రామ్ చరణ్ RRR చిత్రానికే మూడేళ్ళుగా పరిమితం అవడం ఒక కారణమైతే.. బడ్జెట్ పెరుగుతుండటం మరో కారణమని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 13న సినిమాని రిలీజ్ చేయాలనే ఒత్తిడి దర్శకుడి మీద ఉందని.. దీని వల్ల 'ఆర్ ఆర్ ఆర్' ఔట్ పుట్ ఎలా ఉంటుందో అనే సందేహాలు వ్యక్తం చేసేవారు కూడా లేకపోలేదు. తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న కు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఏ విధంగా తీసుకురావాలో తెలియదంటారా?. ఏదేమైనా వీటన్నింటికి అక్టోబర్ 13న సమాధానం దొరుకుతుందని చెప్పవచ్చు. కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.