పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లో మాలీవుడ్ స్టార్స్!

Update: 2021-10-19 09:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయకుడిగా `కేజీఎఫ్` ఫేం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `స‌లార్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు-హిందీ- క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కించి...ఇత‌ర భాష‌ల్లోనూ అత్యంత భారీగా రిలీజ్ చేయ‌నున్నారు. పాన్ ఇండియా కేట‌గిరీలో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. హోంబ‌లే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని అత్యంత‌ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. `కేజీఎఫ్` యాక్ష‌న్ స‌న్నివేశాల్ని మించి స‌లార్ యాక్ష‌న్ ట్రీట్ ఉండ‌బోతుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌భాస్ లాంటి క‌టౌట్ కి త‌గ్గ కంటెంట్ నే ప్ర‌శాంత్ నీల్ ఎంపిక చేసుకుని నిర్మాణంలో ఎక్క‌డా రాజీ లేకుండా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.

ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భాస్.. జ‌గ‌ప‌తిబాబు పాత్ర లే హైలైట్ గా ఉంటాయ‌ని ప్ర‌చారం సాగింది. కానీ తాజాగా సినిమాలో మ‌ల‌యాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ని ఓ కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. పృథ్వీరాజ్ పాత్ర సినిమాలో చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఇది నెగిటివ్ రోల్ నా? పాజిటివ్ కోణంలో ఉంటుందా? అన్న‌ది తేలాల్సి ఉంది. పృథ్వీ రాజ్ మ‌ల‌యాళంలో పెద్ద స్టార్. ఇత‌ర భాష‌ల‌కు ఆయ‌న సుప‌రిచితుడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు భారీగా పారితోషికం ఆఫ‌ర్ చేసి ఎంపిక‌చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ప్ర‌శాంత్ నీల్- పృథ్వీరాజ్ మంచి స్నేహితులు. `కేజీఎఫ్ -2` మ‌ల‌యాళం హ‌క్కుల్ని స్నేహితు పృథ్వీరాజన్ కే అప్ప‌గించారు. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే..

ప్ర‌స్తుతం తెర‌కెక్కుతోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లో టాలీవుడ్ మేక‌ర్స్ ఇత‌ర భాష‌ల ఫేమ‌స్ న‌టుల్ని భాగం చేస్తున్నారు. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `పుష్ప‌`లో మ‌ల‌యాళ స్టార్ ఫహిద్ పాజిల్ విల‌న్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `గాడ్ ఫాద‌ర్` లో మ‌రో మ‌ల‌యాళ న‌టుడ బిజుమీన‌న్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అలాగే మ‌ల‌యాళం మెగాస్టార్ మ‌మ్ముట్టి అఖిల్ హీరోగా న‌టిస్తోన్న `ఏజెంట్` లో నూ న‌టిస్తున్నారు. ఇంకా కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్ ఇటీవ‌ల ఎక్కువ‌గా తెలుగు సినిమాల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.




Tags:    

Similar News