చాలా మంది ఫలానా వ్యక్తికి మానసిక రోగం ఉందని.. చికిత్స చేయించాలని అసహనం పైత్యం ప్రదర్శిస్తుంటారు. నిజానికి ఇలాంటివాళ్లనే మానసిక వైద్యునికి చూపించాల్సి ఉంటుందని కొందరు సైక్రియాటిస్టులు రివర్స్ కోటింగ్ ఇవ్వడం టీవీ చాటింగుల్లో చూసేదే. ఎదుటి వ్యక్తి మానసిక వైకల్యం గురించి ఎవరుపడితే వాళ్లు సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఇక మానసిక వైద్యులు నిపుణులు ఎందుకు? వాళ్లు డాక్టర్లు అయ్యేందుకు కోట్లు తగలేసేది ఎందుకు?
మానసిక ఆరోగ్యం గురించి కంగనా రనౌత్ అభిప్రాయాలు కూడా అలానే చీవాట్లు తినేలా ఉన్నాయని చాలా మంది నెటిజనులు చెబుతున్నారు. ఒక మానసిక నిపుణురాలిలాగా చెప్పేస్తున్న కంగనకు ఆ అధికారం ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మానవ మనస్తత్వ శాస్త్రంలో `ప్రైవేట్ ట్యూషన్లు` తీసుకున్నానని కంగన ప్రచారం చేసుకుంది. అయితే దీనిని ట్విట్టర్ లో పలువురు ఎండగట్టారు. మనోరోగ వైద్యుడిని సందర్శించడం మనస్తత్వశాస్త్రంలో ప్రైవేట్ ట్యూషన్లుగా పరిగణించబడదు అని కోటింగ్ ఇచ్చారు. ప్రతిదీ అన్నీ నీకే తెలుసు! అన్నట్టు మాట్లాడేస్తే తాట తీస్తామని హెచ్చరించారు నెటిజనులు.
ప్రతిదీ తెలియకపోయినా.. నాకు చాలా తెలుసు అంటూ కవరింగ్ కోసం ప్రయత్నించిన కంగనను ఓ నెటిజన్ ఘోరంగానే తిట్టాడు. న్యూయార్కులో స్క్రీన్ రైటింగ్ కోర్స్ తో పాటు మనస్తత్వ శాస్త్రంలోనూ శిక్షణ పొందానని బిగ్ జోక్ వేసింది క్వీన్. కంగనకు మెదడు పనితీరు గురించి ఏమీ తెలియదని అందుకే ఆమె ఆమె ఇలా సమాధానం చెప్పింది అని ఓ నెటిజన్ దెప్పి పొడిచాడు. ఈ డిబేట్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లు వచ్చిన వార్తలను ప్రస్తావించిన కంగన .. బాలీవుడ్ నటవారసులు మాఫియాని విమర్శించే ప్రయత్నం చేసింది. దీపిక వల్ల తన నంబర్ వన్ స్థానాన్ని కోల్పోవడాన్ని ఈ డిబేట్ లో గుర్తు చేసుకుంది కంగన.